Silver price: వెండి ధర కొత్త రికార్డును క్రియేట్ చేసింది. సోమవారం వెండి ధర రూ. 2597 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 1.24లక్షలు దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. అటు బంగారం ధరలు కూడా చరిత్రలో ఏనాడూ లేనివిధంగా 1.07లక్షలకు చేరుకుంది. భవిష్యత్తులో వెండి ధర కిలోకు రూ. 2లక్షల చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
1/6దేశీయంగా వెండి ధరలు మరోసారి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కిలో వెండి ధర రూ.1.25 లక్షలు దాటేసింది. అంతర్జాతీయ స్థాయిలో వెండికి డిమాండ్ పెరగడం, ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్‌గా వెండిని ఎంచుకోవడం వల్ల వెండి ధరలు మరింతగా ఎగబాకుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
2/6సాధారణంగా వెండి ధరలు బంగారంతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి. అయితే ఈసారి ట్రెండ్ మారినట్లు కనిపిస్తోందని చెప్పవచ్చు. గ్లోబల్ మార్కెట్లలో రిసెషన్ భయం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత కారణంగా పెట్టుబడిదారులు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు.
3/6బులియన్ మార్కెట్ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ పారిశ్రామిక డిమాండ్ రానున్న సంవత్సరాల్లో మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో వెండి ధరలు కిలోకు రూ.2 లక్షలు దాటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
4/6ఇక భారత మార్కెట్‌లో కూడా వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఆభరణాల కోసం వెండి కొనుగోళ్లు ఈ సీజన్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు వెండి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతోందని చెప్పుకోవచ్చు.
5/6అటు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెడితే వచ్చే ఏడాది మంచి లాభాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వెంటనే వచ్చే లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు వెండిని ఆప్షన్‌గా ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు.
6/6మొత్తానికి, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే కిలో ధర రూ.2 లక్షలు దాటుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు, సాధారణ వినియోగదారులందరూ ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తున్నారు.