Add Zee Business As A Preferred Source
App

Silver Price Crash: భారీగా తగ్గిన వెండి ధర.. ఏకంగా రూ. 13వేలు తగ్గింపు.. దీపావళికి బంగారం కాదు వెండి కొనండి.. !!

Written ByBhoomi
Published: Oct 18, 2025, 10:52 AM IST|Updated: Oct 18, 2025, 10:52 AM IST

Silver Price Crash: దీపావళికి ముందు వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా బంగారం పక్కకు నెట్టి జెట్ స్పీడుతో దూసుకుపోయిన వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. శనివారం వెండి ధరలు 6 శాతం తగ్గి..గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక తగ్గుదల  నమోదు అయ్యింది. ఈ పతనం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇన్వెస్టర్లకు మాత్రం ఆందోళన కలిగించిందని చెప్పవచ్చు. 

IBJA1/6

భారత జువెల్లర్స్ అండ్ గోల్డ్ అసోసియేషన్‌

భారత జువెల్లర్స్ అండ్ గోల్డ్ అసోసియేషన్‌ (IBJA) ప్రకారం, అక్టోబర్ 17న వెండి ధర కిలోకు రూ. 190,275గా ఉండగా రోజు ముగిసే సమయానికి అది రూ. 177,250కు పడిపోయింది. అంటే ఒక్కరోజులోనే సుమారు 13,000 తగ్గుదల నమోదైంది. ఇది వెండి ధరలు గత కొన్ని వారాలుగా ఎగబాకిన దిశకు బ్రేక్ వేసినట్లై అని చెప్పవచ్చు. 

American economy2/6

అమెరికా ఆర్థిక వ్యవస్థ

అమెరికా ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ నాణ్యతపై ఉన్న ఆందోళనలు తగ్గడంతో పాటు, అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కొంత సడలడం వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు వాణిజ్య యుద్ధంపై ఉన్న ఆందోళనలను తగ్గించాయి. మరోవైపు, అమెరికాలో ప్రాంతీయ బ్యాంకుల నుండి వచ్చిన సానుకూల ఫలితాలు స్టాక్ మార్కెట్‌ను కొంత స్థిరపరిచాయి.  

Interest income from gold and silver3/6

బంగారం, వెండి వంటి వడ్డీ ఆదాయం

స్టాక్ మార్కెట్ బలపడడం, బాండ్ దిగుబడి పెరగడం వల్ల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని లోహాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇదే కారణంగా పెట్టుబడిదారులు తమ వెండి హోల్డింగ్స్‌ విక్రయించి లాభాలు తీసుకోవడం ప్రారంభించారు.

Spot silver prices4/6

స్పాట్ వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికాలో శుక్రవారం స్పాట్ వెండి ధరలు 6శాతం తగ్గి ఆరు నెలల్లో అత్యధిక ఒక్కరోజు పతనాన్ని నమోదు చేశాయి. ఔన్సుకు $54.63 గరిష్ట స్థాయి నుండి $51.86 వరకు పడిపోయి చివరికి 4.75శాతం క్షీణతతో ముగిశాయి. ఈ మార్పు భారత మార్కెట్‌పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపింది.  

Silver squeeze5/6

వెండి స్క్వీజ్‌

లండన్ మార్కెట్లో గత కొన్ని వారాలుగా "వెండి స్క్వీజ్‌"గా పిలిచి ధరల ఒత్తిడి గణనీయంగా తగ్గింది. దీనివల్ల పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించగా, ఇది వెండి ధరలపై మరింత ఒత్తిడిని పెంచింది. ఈ పరిణామం వల్ల మార్కెట్‌లో కొంత స్థిరత్వం వచ్చినప్పటికీ, తాత్కాలికంగా ధరలు తగ్గడం కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Silver prices on Dhanteras6/6

ధంతేరాస్‌ రోజున వెండి ధరలు

ధంతేరాస్‌ రోజున వెండి ధరలు తగ్గడం వినియోగదారులకు ఒక శుభవార్తగా నిలిచింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు, వాణిజ్య ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల వ్యూహాలు వంటి అంశాలు భవిష్యత్తులో వెండి ధరల దిశను నిర్ణయించనున్నాయి. సమీప కాలంలో వెండి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.