Simple Aloo Paratha Recipe: ఉదయాన్నే టిఫిన్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ, వడ, పూరీ, దోశ, ఉప్మా వంటివి కామన్. కానీ, ఉత్తర భారతదేశ వంటకాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అందులోనూ అది ఫేమస్ ఆలూ పరోటా. సౌత్ ఇండియా స్టైల్లో తక్కువ సమయంలో ఎలా తయారు చేయోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే టిఫిన్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ, వడ, పూరీ, దోశ, ఉప్మా వంటివి కామన్. కానీ, ఉత్తర భారతదేశ వంటకాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అందులోనూ అది ఫేమస్ ఆలూ పరోటా. సౌత్ ఇండియా స్టైల్లో తక్కువ సమయంలో ఎలా తయారు చేయోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పరోటా తయారీకి ముందుగా.. గోధుమ పిండి, తగినంత ఉప్పు, నూనె, కావాల్సినంత నీళ్లు కలిపి చపాతి పిండిలా రెడీ చేసుకోవాలి. అలా చేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
ఆ తర్వాత 3 బంగాళాదుంపలను ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి. ఆలూ ఉడికించే సమయంలో అందులో కొంచెం ఉప్పు వేయాలి.
ఆ వెంటనే మెత్తగా తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ కాశ్మీరీ మిరపకాయ, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడిని బంగాళదుంపల గుజ్జును బాగా కలపాలి.
ముందుగా రెడీ చేసుకున్న చపాతీ పిండిని రుద్ది చపాతి సైజు రెడీ చేసుకోవాలి. దానిపై బంగాళదుంపలు మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని రెడీ చేసిన పచ్చి చపాతిపై స్ప్రెడ్ చేసి.. ఆ తర్వాత దానిపై మరోకటి వేసి మధ్యలో ఆలూ స్మాష్ వచ్చేలా చేయాలి.
ఆ తర్వాత పాన్‌లో నూనె లేదా బటర్ వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. బటర్ వేస్తే ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది. ఇక ఆలస్యం లేకుండా ఆలూ పరోటాను లాగించేయోచ్చు.