Weight Loss: ఇప్పటి జీవనశైలిలో అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు, తినే అలవాట్లు.. వ్యాయామం లేకపోవడం వలన శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇది పెరిగితే డయాబెటిస్.. హై బ్లడ్ ప్రెషర్..హార్ట్ సమస్యలు వంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని చిన్న మార్పులు చేస్తే బరువు తగ్గడం చాలా సులభం.
1/6రోజు వారి పనుల్లో చిన్న మార్కులు చేస్తే ఎంతో బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా..రోజూ చేసే పనుల్లో కొంచెం శారీరక శ్రమ పెంచితే చాలు.. అంతే గాని ప్రత్యేకంగా జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఆఫీసుల్లో లిఫ్ట్ కన్నా మెట్లు ఎక్కడం మంచిది. పైకి, కిందికి నడవడం వలన శరీరం కదులుతుంది, కొవ్వు కరుగుతుంది. ఇంటర్‌కామ్ వాడటం తగ్గించి సహోద్యోగుల దగ్గరికే నడుచుకుంటూ వెళ్లండి.
2/6ఇంట్లో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండండి. వీలైనంత వరకూ ఇంటి పనులు చేయండి. శుభ్రం చేయడం, దుమ్ము తుడవడం, గార్డెనింగ్ లాంటివి శరీరానికి వ్యాయామంగా పని చేస్తాయి. వీటిని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది.
3/6ఇంటి దగ్గర షాపింగ్ కోసం కూడా స్కూటర్, బైక్ వాడే అలవాటు చాలామందిలో ఉంటుంది. చిన్న దూరానికి మాత్రం నడిచిపోవడం లేదా సైకిల్ వాడటం మంచిది. వీటి వలన కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
4/6ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కుర్చీలో కూర్చోకుండా నడుస్తూ మాట్లాడండి. ఇలా చేసినా శరీరం కదులుతుంది. అదనంగా అవకాశం ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. బస్సు స్టాప్ వరకూ నడవాల్సి అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక వ్యాయామమే.
5/6పార్కుల్లో ఉదయం లేదా సాయంత్రం కాస్త టైమ్ కేటాయించి నడవండి. శుభ్రమైన గాలి.. నడక రెండూ కలిస్తే శరీరం తేలికగా ఉంటుంది. బరువు త్వరగా తగ్గుతుంది.
6/6చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి. క్రమంగా పాటిస్తే కొవ్వు తగ్గి శరీరం ఫిట్‌గా మారుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. మంచి ఆహారం, తగు నీరు, చురుకైన జీవనశైలి ఉంటే బరువు తగ్గడం అసాధ్యం కాదు.