Excess Salt: కూరలో ఉప్పు ఎక్కువైందా.. అయితే టెన్షన్ పడకుండా ఈ చిన్ని చిట్కా పాటించండి..!

Excess Salt in Curry : చాలామంది కూర చేసేటప్పుడు తెగ టెన్షన్ పడిపోయేది ఉప్పు వేసేటప్పుడు మాత్రమే. ఎందుకంటే పొరపాటున ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ.. టేస్ట్ మొత్తం పోతుంది. అంతవరకు కష్టపడి చేసిన కూర కూడా రుచిగా అనిపివ్వదు. కానీ ప్రతిసారి ఉప్పు కరెక్ట్ గా వెయ్యడం అనేది అందరికీ సులభమైన పని కాదు..

1 /5

తెలిసో, తెలీకో ఏదో ఒక్కసారైనా కూరలో ఉప్పు ఎక్కువైపోవడం ఖాయం. ఇక ఉప్పు ఎక్కువైతే అప్పుడు దాకా ఎంతో కష్టపడి చేసిన కూరను అందరూ కూడా ఏంటి ఇలా ఉంది అనేస్తారు. 

2 /5

అందుకే కూరలో ఉప్పు ఎక్కువైతే ఏమి చేయాలి అనేది అందరికీ ఉందే టెన్షన్. అయితే కూరలో ఉప్పు ఎక్కువైతే.. ఒక చిన్ని చిట్కాతో అది కాస్త తగ్గించవచ్చు. 

3 /5

పొరపాటున కూరలో.. ఉప్పు ఎక్కువైనప్పుడు మనకు కావలసింది కేవలం కొద్దిగా పెరుగు మాత్రమే. పెరుగు లేదా  ఉల్లిపాయ ఉన్నా కానీ ఉప్పు ఎక్కువైన కూరను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు.  

4 /5

కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే..  2 లేదా 3 చెంచాల పెరుగు కూరలో కలిపితే.. చాలు..ఉప్పు తగ్గడంతో పాటు, కూరకు మరింత రుచి కూడా తోడవుతుంది ఎక్సట్రా టేస్ట్‌ యాడ్‌ అవుతుంది. పెరుగు బదులు మీగడ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. పెరుగు లేకపోతే పాలు కూడా పోయవచ్చు.

5 /5

ఇక పాలు, పెరుగు లాంటివి ఇష్టపడని వాళ్ళు.. ఉల్లిపాయ, టమాటా కలిపి ముద్దగా చేసి కూరలో వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు తగ్గుతుంది. లేదు అంటే నూనెలో ఉల్లిపాయ వేయించుకొని అది కూరలో వేసుకున్నా కానీ ఉప్పు తగ్గటం ఖాయం.