Add Zee Business As A Preferred Source
App

Singer Sunitha: చూడగానే టెంప్ట్ అయ్యా..!.. ఫస్ట్ క్రష్‌ గురించి షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ సునీత.. ట్విస్ట్ అదుర్స్...

Written ByInamdar Paresh
Published: Apr 24, 2025, 02:43 PM IST|Updated: Apr 24, 2025, 02:53 PM IST


Singer Sunitha in News:  సింగర్ సునీత ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ సునీత, ప్రవస్తిల వివాదం సోషల్ మీడియాలో కాకరేపుతుంది. ఈ క్రమంలో సింగర్ సునీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వైరల్ గా మారాయి.

singer sunitha:1/6

సింగర్ సునీత రచ్చ;

సింగర్ సునీత ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా పాడుతా తీయగాలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రవస్తి అనేక సింగర్.. సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన మీద కోపంతో కావాలని తనను ఎలిమినెట్ చేసిందని, ఇతర జడ్జీలకు సైతం తనపై నెగెటివిటీ మాటలు చెప్పిందని తన బాధను చెప్పుకుంది.  

singer sunitha vs pravasthi:2/6

సింగర్ సునీత లేటెస్ట్ న్యూస్;

 సింగర్ సునీత సైతం.. ప్రవస్తికి పలుమార్లు కౌంటర్ లు ఇచ్చారు. ఈ ఎపిసోడ్ గత వారం నుంచి నడుస్తునే ఉంది. ఇది పక్కన పెడితే..  సింగర్ సునీత గాయనిగా మాత్రమే కాకుండా.. డబ్బింగ్  ఆర్టిస్ట్ గా, యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో.. సౌందర్య, రాశి, త్రిష, కమలినిముఖర్జీ, స్నేమ, కత్రినా కైఫ్ ల వంటి టాప్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.

singer sunitha dating:3/6

సింగర్ సునీత ప్రవస్తి కాంట్రవర్సీ;

ప్రస్తుతం సింగర్ సునీత.. కమెడియన్ అలీతో ఒక షోలో సరదాగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో  సింగర్ సునీతను.. అలీ మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని ఫన్నీగ ప్రశ్నించాడు.. దీనికి అందరు ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్తుందని అనుకున్నారు. కానీ సునీత అందరికి షాక్ ఇస్తు.. తనకు జాకీ ష్రాఫ్ అంటే ఎంతో క్రష్ ఉండేదని.. ఏంటో చిన్న ఏజ్ లో ఆయన్ను చూసిన మొదటి చూపులోనే నచ్చాడని.. ఆయనంటే పడిచచ్చేదన్నని నవ్వుతు నిజం చెప్పేసింది.  

singer sunitha latest news:4/6

సింగర్ సునీత ఫస్ట్ క్రష్;

దీంతో అక్కడున్న వారంత జాకీ ష్రాఫ్ నచ్చాడా.. అని షాక్ అయ్యారంట. అదే విధంగా అలీ.. తనకు జాకీ ష్రాఫ్  గురించి తెలసిన విషయాలను పంచుకున్నారు. ఆయన సినిమాల్లోకి రాకముందు వీధి రౌడీగా డబ్బులు వసులు చేశారని అలీ చెప్పారు. దీనికి సింగర్ సునీత..  సునీత మాట్లాడుతూ..  అయితే ఏపనిచేశాడో తెలీదు కానీ.. సినిమాల్లో వచ్చాక..  ఆయన నా మనసు మాత్రం దోచుకున్నారని ఫన్నీగా అన్నారు.   

singer sunitha firest crush:5/6

సింగర్ సునీత కాంట్రవర్సీ;

ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట రచ్చగా మారాయి.  సింగర్ సునీత..  టాలీవుడ్ లో గులాబి చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ్ముడు, బద్రి, మురారీ వంటి సినిమాలు ఆమెను ఓక రేంజ్ లో స్టార్ డమ్ వచ్చేలా చేశాయి. ఈ క్రమంలో సింగర్ సునీత స్టార్ సింగర్ గా మారిపోయారు.  

singer sunitha latest news;6/6

సింగర్ సునీత;

అయితే.. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. రామ కృష్ణ వీరపనేన పెళ్లిచేసుకున్నారు. పెళ్లిడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు పెళ్లి ఏంటని ఆమెను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఇక మరికొందరు ఆమె ప్రెగ్నెంట్ అని కూడా ఛెండాలంగా ట్రోల్స్  చేశారు. ఇప్పటికే ట్రోలర్స్ పై సింగర్ సునీత పలుమార్లు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆమె తన ఫస్ట్ క్రష్ గురించి చేసిన కామెంట్స్ మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  

Trending

  • News
  • Photos
  • Videos