Singer Sunitha Emotional : సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో వందల పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ సింగర్. అయితే సింగర్ సునీత ఈమధ్య ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/4పర్సనల్ లైఫ్ ద్వారా అలానే ప్రొఫెషనల్ లైఫ్ ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సింగర్ సునీత. ఆమె గానానికి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే.
2/4ఎన్నో వందల పాటలు పాడి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా సింగర్స్ సునీత ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్న ఒక సంఘటన తెగ వైరల్ అవుతుంది.
3/4అసలు విషయానికి వస్తే..పాడుతా తీయగా ప్రోగ్రామ్ సెమీ ఫైనల్ చివరి రౌండ్‌లో మణిశర్మ స్పెషల్ సాంగ్స్ పాడారు అందరూ. అంతేకాదు వాళ్లు పాడిన తర్వాత అక్కడ ఉన్న కీరవాణి ప్రతి సాంగ్ తరువాత మణిశర్మ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో సునీత ఎమోషనల్ అయ్యారు.
4/4ఈ ప్రోమో చివరిలో.. అల్లు అర్జున్..వరుడు సినిమాలోని "బహుశా ఓ చంచల" పాట పాడాడు కార్తికేయ. ఇది వింటున్నప్పుడే.. సునీత చాలా ఎమోషనల్ అవ్వదమే కాకుండా.. వెంటనే వెళ్లి కార్తికేయని హగ్ చేసుకుని మరి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని సైతం కీరవాణి మణిశర్మ కి ఫోన్ లో తెలిపారు.