Singer Sunitha: నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా..?.. సింగర్ సునీత సీరియస్..

Singer sunitha fires on social media rumors: ఒకర్ని ఒకమాట అనే మందు కొంచెం ఆలోచించాలని సింగర్ సునీత అన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ , అసత్యప్రచారాలపై సింగర్ సునీత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
 

1 /6

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందంతో పాటు గాత్రంతో అభిమానుల్ని సంపాదించుకుంది. పలు మూవీస్ లలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచిగుర్తింపు తెచ్చుకుంది. గతంలో.. రాశి, త్రిష, కమలినిముఖర్జీ, స్నేహ మొదలైన స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు.  పాడుత తీయగా లో హోస్ట్ గా కూడా చేశారు. అయితే.. సింగర్ సునీత ఇటీవల ఎక్కువగా ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో వార్తలలో ఉంటున్నారు.  

2 /6

కొన్ని నెలల క్రితం సింగర్ ప్రవర్తి, సింగర్ సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.తనకు జడ్జీగా వ్యవహరించిన సింగర్ సునీత అన్యాయం చేశారని బహిరంగా ఆరోపణలు చేశారు. దీనిపై స్వయంగా సింగర్ సునీత క్లారిటీ ఇచ్చుకొవాల్సి వచ్చింది.  

3 /6

అయితే సునీత తన భర్తతో విడిపోయిన తర్వాత  వీర‌పనేని రామకృష్ణ‌ను పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్లి తర్వాత తరచుగా నెటిజన్లు ఏదో ఒక రకంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లిడుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకుని రెండో పెళ్లి ఎందుకని కొంత మంది ట్రోల్స్ చేశారు. ముసలోడికి దసరా పండగ అంటూ రామ్ వీరపనేనిని కూడా ట్రోల్స్ లోకి లాగారు.  

4 /6

మరికొంత మంది సునీత ప్రెగ్నెంట్ అని కూడా నీచంగా వార్తలు వైరల్ చేశారు. పెళ్లిడుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిదంటూ ఘోరంగా సునీతను ట్రోల్స్ చేశారు. ఇంకా కొంత మంది నీచులు సునీతకు రెండో పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని, వీర‌పనేని రామకృష్ణ‌ తో డైవర్స్ కు రెడీ అయిపోయారని పాపాత్ములు సునీతపై లేని పోనీ రూమర్స్ స్ప్రేడ్ చేశారు. అయితే.. దీనిపై పలు సందర్భాలలో సింగర్ సునీత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.  

5 /6

ప్రస్తుతం సింగర్ సునీత ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ప్రచారం, ఫెక్ రూమర్స్ వై సీరియస్ అయ్యారు. అసలు నోటికొచ్చింది ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. కొంచెమైన సంస్కారం ఉండాల్సిన అవసరంలేదా అంటూ తీవ్రస్థాయిలో అసహానం వ్యక్తం చేశారు.   

6 /6

ఎవరైన తెరముందు కానీ, తెర వెనుక కానీ మాట్లాడేముందు ఆలోచించాలని గడ్డిపెట్టారు. అసలు అలాంటి సంస్కారం లేని వారి గురించి పట్టించుకొవాల్సిన అవసరంతనకు లేదని తెల్చి చెప్పారు. మొత్తంగా సింగర్ సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.