Smita Sabharwal Couple Completes 24 Years As IAS And IPS Officeres Celebrations Pics Goes Viral: అధికారిగా విధి నిర్వహణలో ప్రత్యేకత సాధిస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆదరాభిమానం పొందుతున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సంబరాల్లో మునిగారు. భర్తతో కలిసి ఆమె చేసుకున్న సంబరాల ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/8ఐఏఎస్ అధికారిణిగా స్మితా సబర్వాల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెతో పాటు ఆమె భర్త ఐపీఎస్ అధికారిగా అకున్ సబర్వాల్‌కు మంచి పేరు ఉంది. ఈ ఇద్దరు జంట ఇప్పుడు సంబరాల్లో మునిగారు. తమ జీవితంలో కీలక మైలురాయి దాటడంతో సివిల్ సర్వీస్ జోడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
2/8సివిల్ సర్వీస్‌లోకి స్మితా సబర్వాల్, అకున్ సబర్వాల్ వచ్చి 24 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని స్మిత స్వయంగా పంచుకున్నారు. తన భర్తతో కలిసి ఈ విషయాన్ని పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.
3/8'ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మేము ప్రజా సేవలో చేరి నేటికి 24 సంవత్సరాలు. ఇది అద్భుతమైన ప్రయాణం. ఒక సంపూర్ణ గౌరవం! 2001 బ్యాచ్ మొత్తానికి శుభాకాంక్షలు' అని 'ఎక్స్'లో స్మితా సబర్వాల్ పోస్టు చేశారు.
4/8'ఐఏఎస్, ఐపీఎస్‌లుగా నేటికి 24 సంవత్సరాలు పూర్తి. సుదీర్ఘమైన, ఉత్తేజకరమైన ప్రయాణం ఇది. సివిల్ సర్వీస్ అనేది కష్టాలతో కూడుకున్నది. కానీ బలహీన హృదయం ఉన్నవారి కోసం కాదు. ఈ బాధ్యతను చేపట్టిన వారందరికీ సెల్యూట్. దేశ సేవలో మీరు శక్తితో ఎదగాలని కోరుకుంటున్నా' అని సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
5/8ప్రస్తుతం భార్యాభర్తలు స్మిత, అకున్ సబర్వాల్ సుదీర్ఘ సెలవులో ఉన్నారు. వారిద్దరూ పలు ప్రాంతాల సందర్శనకు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా పోస్టు చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తే వారిద్దరూ జమ్మూ కశ్మీర్‌లో హిమాలయ పర్వత అందాలను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.
6/8సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా ఉన్న స్మితా సబర్వాల్‌కు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విశేష ప్రాధాన్యం ఇచ్చారు. పరిపాలనలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమెను సద్వినియోగం చేసుకుని తెలంగాణలో చక్కటి విధులు నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచారు.
7/8తాజాగా మారిన పరిస్థితుల కారణంగా స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించడం లేదని చర్చ జరుగుతోంది. ఆమెపై కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. అత్యున్నత పదవి నుంచి తప్పించి అనామక పోస్టులు ఇస్తుండడం దానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.
8/8తెలంగాణకు మిస్ వరల్డ్ పోటీలను తీసుకురావడానికి వెనుక కీలకంగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఆ ఈవెంట్ నుంచి తప్పించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆర్థిక ప్రణాళిక విభాగంలో ఒక అనామక స్థానంలో కొనసాగుతున్నారు. ఈ అసంతృప్తితోనే స్మితా సబర్వాల్ సుదీర్ఘ సెలవులో ఉన్నారని తెలుస్తోంది.