Smriti Mandhana Creates History: స్మృతి మంధాన భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్‌గా అద్భుతమైన చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆమె 77 బంతుల్లో సెంచరీ చేసి, ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు సాధించింది.
1/5టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆస్ట్రేలియా పై అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
2/5ఆస్ట్రేలియాతో ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో.. మంధాన 77 బంతుల్లో శతకం చేయడంతో ఈ ఘనత సాధించింది.
3/5ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్ బ్యాటర్ నాట్‌స్కైవర్ బ్రంట్ పేరిట ఉండేది. ఆమె 2022 మార్చి 5న హామిల్టన్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బ్రంట్ 79 బంతుల్లో సెంచరీ చేసింది. ఈ లిస్ట్‌లో మంధాన, బ్రంట్ తరువాత లిజెల్లె లీ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు ఉన్నారు.
4/5అంతేకాకుండా, మహిళల వన్డే క్రికెట్‌లో భారత జట్టు తరఫున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా మంధాన రికార్డు సృష్టించింది.
5/5అలాగే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా స్మృతి మంధాన పేరిటే ఉంది. గతంలో మంధాన ఐర్లాండ్‌పై 70 బంతుల్లో సెంచరీ చేసింది.