Smriti Mandhana: ఇండియా మహిళ జట్టు వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. శనివారం మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టైలీష్ బ్యాటర్ స్మృతి మంధాన వీరవిహారం చేసింది. కేవలం 63 బంతుల్లోనే 125 రన్స్ చేయగా.. అందులో 17 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఈ ఏడాది నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డ్ క్రియేట్ చేసింది.
1/5భారత మహిళల క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో శనివారం మూడో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటర్ స్మృతి మంధాన అద్భుతంగా ఆడింది. కేవలం 63 బంతుల్లో 125 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
2/5మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. ఆ జట్టులో బెత్ మునీ 75 బంతుల్లో 138 పరుగులతో రాణించి, జట్టు స్కోరు 400 దాటడానికి సాయం చేసింది. భారత జట్టు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది.
3/5బరిలోకి దిగిన స్మృతి మంధాన దూకుడుగా ఆడింది. మూడో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు, ఐదో ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్, ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది. ఆ తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదింది. ఇలా కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ, 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది.
4/5ఈ సెంచరీతో మహిళల వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి రికార్డు సృష్టించింది. అలాగే, విరాట్ కోహ్లీ 52 బంతుల్లో చేసిన రికార్డును బద్దలు కొట్టి, వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా కూడా నిలిచింది.
5/5స్మృతి మంధాన మహిళల వన్డేల్లో 13 సెంచరీలతో సుజీ బేట్స్‌తో కలిసి రెండో స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ 15 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి నిలిచింది. అయితే, స్మృతి అద్భుతంగా ఆడినప్పటికీ, భారత జట్టు 47 ఓవర్లలో 369 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.