Smriti Mandhana Husband Net Worth : భారత క్రికెట్ స్టార్ స్మృతీ మంధాన పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఆమె జీవిత భాగస్వామిగా బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, చిత్ర నిర్మాత అయిన పలాష్ ముచ్చల్ ను ఎన్నుకున్నారు. ఈ జంట వివాహం త్వరలో జరగనుందని పలాష్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితం, సంపాదన, జీవనశైలి గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
1/5పలాష్ ముచ్చల్ 1995 మే 22న మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జన్మించారు. ఆయన ప్రసిద్ధ గాయని పలక్ ముచ్చల్ తమ్ముడు. బాల్యంలోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న పలాష్, 18 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆయన తొలి చిత్రం డిష్కియావూన్ (2014). ఈ చిత్రంతో ఆయన బాలీవుడ్‌లో అతి పిన్న వయసులో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు.
2/5పలాష్ ముచ్చల్ సంగీత దర్శకుడు..గాయకుడు, రచయిత. చిత్ర నిర్మాతగా బహుముఖ ప్రతిభ చూపిస్తున్నారు. ఆయన "పార్టీ తో బంటి హై", "తూ హీ హై ఆశికీ" వంటి హిట్ పాటలతో ప్రజాదరణ పొందారు. అలాగే భూత్‌నాథ్ రిటర్న్స్.. అమిత్ సాహ్నీ కీ లిస్ట్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో కూడా చోటు సంపాదించారు.
3/5మీడియా రిపోర్టుల ప్రకారం, పలాష్ ముచ్చల్ 2025 నాటికి రూ.20 కోట్ల నుండి రూ.41 కోట్ల వరకు నికర ఆస్తి కలిగి ఉన్నారు. ఆయన ఆదాయం సంగీతం, సినిమా నిర్మాణం, రాయల్టీలు, లైవ్ ప్రదర్శనల ద్వారా వస్తుంది. ఆయనకు ముంబైలో కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది.
4/5పలాష్ తన అక్క పలక్‌తో కలిసి భారతదేశం అంతటా సంగీత ప్రదర్శనలు ఇస్తూ.. గుండె శస్త్రచికిత్సలకు అవసరమైన పిల్లల కోసం నిధులు సేకరిస్తూ కూడా ఉంటారు. ఇప్పటివరకు రూ.2.5 కోట్లకు పైగా సేకరించారు.
5/52019లో వీరిద్దరూ పరిచయమయ్యారు. క్రమంగా స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధానికి సిద్ధమవుతున్నారు. స్మృతీ మంధాన సొంతంగా రూ.32 నుండి రూ.34 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. పలాష్ ముచ్చల్ ఆస్తులతో కలిపి ఈ జంట రూ.70 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నట్లు అంచనా. క్రీడా ప్రతిభ.. కళా నైపుణ్యం కలయికతో ఈ జంట 2025లో అత్యంత.. చర్చనీయాంశంగా మారింది.