Snake Bite: పాము అంటే చాలా మందికి హడల్. కానీ కాటు వేసిన తర్వాత ఎంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి? విషాన్ని తొలగించడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఇంజెక్షన్ ఏమిటనేది చాలా మందికి తెలియదు. అవేంటో చూద్దాం..
Snake Bite: వర్షాకాలంలో పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు వాటి బొరియలలోకి ప్రవేశించినప్పుడు, పాములు బయటకు వచ్చి ఇళ్ల వైపు ఆకర్షితులవుతాయి. పాములు ఎక్కువగా చెట్లు పొదల్లో ఆశ్రయం పొందుతుంటాయి. చాలా పాములు విషపూరితమైనవి. కాటు వేసిన కొన్ని నిమిషాల్లోనే విషాన్ని నిరోధించే ఇంజెక్షన్ ఇవ్వకపోతే మరణం సంభవించవచ్చు.
యాంటీ స్నేక్ వినమ్ (ASV) అనే ఔషధం.. పాము కాటుకు అత్యంత ప్రభావవంతమైన మందుగా పరిగణించబడుతుంది. ఇది డాక్టర్లు రాసిచ్చే ప్రిస్కిప్షన్. ఇది నాలుగు రకాల విషాలను కలపడం ద్వారా పనిచేస్తుంది. విషపూరిత పాములు కాటు వేసిన తర్వాత విషాన్ని పాకకుండా చేస్తోంది. ఇది ప్రాణాలను కాపాడుతుంది.
డాక్టర్ల ప్రకారం.. విషం లేని పాము కాటుకు ASV అవసరం లేదు. కానీ విషపూరిత పాము కాటుకు వెంటనే ASV ఇంజెక్షన్ అత్యంత ఆవశ్యకరం. ఉదాహరణకు, మీరు కోబ్రా లేదా క్రైట్ వంటి పాము కాటుకు గురైతే, 30 నుండి 40 నిమిషాలలోపు ASV ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా విషయం పాకగుండా ఉంటుంది. దాంతో మనిషి ప్రాణాలను నిలబెట్టవచ్చు.
పాము కాటు తర్వాత ఒక వ్యక్తికి ఎన్ని ASV ఇంజెక్షన్లు అవసరమో అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రోగులకు విషానికి తేలికపాటి ప్రతిచర్య ఉంటే ఒక మోతాదుకే మొత్తం విషం శరీరం నుంచి మటు మాయం కావొచ్చు.
కానీ కొన్ని సందర్భాల్లో, పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. వారికి మూడు లేదా నాలుగు అదనపు మోతాదులు అవసరం కావచ్చు. కొన్నిసార్లు, పాము అత్యంత విషపూరితమైనది అయితే, ప్రతి మోతాదులో యాంటీబాడీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి ASV యొక్క అధిక మోతాదును ఉపయోగించాల్సిన అవసరం కావచ్చు.
గమనిక: ఈ వ్యాసం గృహ నివారణలు, సాధారణ సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. Z న్యూస్ దీనిని నిర్దారించడం లేదు. దీనిని స్వీకరించే ముందు ఎల్లప్పుడూ డాక్టర్ల సలహా తీసుకోండి.