Unknown Snake Facts: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

Unknown Snake Facts: కొన్ని రకాల చెట్లు కొన్ని జంతువులకు పక్షులకు ఆలవాలం అని చెప్పాలి. అలా పాములకు కూడా కొన్ని చెట్లు అంటే విపరీతమైన ఇష్టం. అందుకే పాములు  చీమలు పెట్టిన పుట్టల తర్వాత ఎక్కువగా ఈ చెట్లనే ఆవాసాలుగా చేసుకొని జీవిస్తాయి. అవి మీ ఇంటి చుట్టు పక్కల ఉంటే.. వాటికి రెడ్ కార్పెట్ పరిచినట్టే.

1 /6

Snake Facts: ఈ చెట్లను పాముల గుహగా పిలుస్తారు. అవుము పాములు ఎక్కువగా పుట్టలతో పాటు గంధపు చెట్లపైనే ఎక్కువగా ఉంటాయి. గంధపు చెక్క కలప నుండి ఎన్నో సుగంధ ద్రవ్యాలు తయారు చేయబడతాయి.  గంధపు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సువాసలు వెదజల్లబడుతుంటాయి. గంధపు  కలప నుండి పరిమళ ద్రవ్యాలు, అగరబత్తీలు, సబ్బులు వంటి అనేక ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయబడుతున్నాయి. మతపరమైన కార్యకలాపాలలో ముఖ్యంగా హిందూ పూజాదికల్లో  చందనానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

2 /6

కానీ గంధపు చెట్టు సువాసనలతో పాటు పాములు ఆవాసంగా  ప్రసిద్ధి చెందింది. ఆ చెట్లు ఎక్కడుంటే.. ఆ చెట్టుకు పాములు పెనవేసుకొని ఉంటాయి. ఆ చెట్టు సువాసన అంటే మనుషులతో పాటు పాములు ఎంతో ఇష్టం. పాములు గంధపు చెట్లపై ఉండటం మూలానా ఎవరు ఆ చెట్లను నరికే సాహసం చేయరు. ఓ రకంగా పాములు చెట్ల సంరక్షకులుగా పనిచేస్తున్నాయే చెప్పాలి.   గంధపు చెట్లు వాటి దట్టమైన నీడ,  చల్లని గాలి వలన పాములు వాటిని పెనవేసుకొని ఉంటాయి.

3 /6

పాములు సహజంగానే చల్లని, తేమతో కూడిన ప్రదేశాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటాయి.  ఇది పాములు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయ పడుతుంది. వేసవి రోజుల్లో, గంధపు చెట్లను ఆవాసలుగా చేసుకుంటాయి. వాటితో పాటు సంపంగి  చెట్లు ఉంటే వాటిని ఆశ్రయిస్తుంటాయి. ఎలుకలు, బల్లులు మరియు కీటకాలు వంటి చిన్న జీవులు తరచుగా గంధపు చెట్ల చుట్టూ కనిపిస్తుంటాయి. అవి పాములకు ఆహారం. అందుకే పాములు ఈ చెట్ల దగ్గర నివసించడానికి ఇష్టపడటానికి కారణం అది కూడా చెప్పొచ్చు.

4 /6

ఎందుకంటే పాములు ఎర కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, గంధపు చెట్టు యొక్క వేర్లు, దట్టమైన ఆకులు పాములకు దాక్కువడానికీ అనువైన ప్రదేశం.గంధపు చెక్క యొక్క నిజమైన లక్షణం దాని సువాసన. కానీ దాని కలపను రుద్దకపోతే అది దాని సుగంధాన్ని వెదజల్లదు. అందుకే చాలామంది సులభంగా గుర్తించలేరు. ఈ కారణంగా, అక్కడ ప్రశాంతంగా నివసించడానికి పాములు ఆవాసంగా మారాయి.

5 /6

నిజానికి, గంధపు చెట్టు, పాము ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి.  ఈ సంబంధం ప్రకృతి సమతుల్యతలో ఒక భాగం అని చెప్పాలి.  పాములు చందనపు సమీపంలోని చిన్న జీవుల సంఖ్యను నియంత్రించడం ద్వారా గంధపు చెట్టు దాని చుట్టుపక్కల చెట్లను రక్షిస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. 

6 /6

గమనిక: ప్రియమైన పాఠకులకు చెప్పేదేమిటంటే.. ఈ వార్త చదివినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వార్త రాసేటప్పుడు మేము సాధారణ సమాచారం సహా, పురణాలు, శాస్త్ర సాంకేతిక అంశాల ఆధారంగా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వార్తలకు సంబంధించిన ఎలాంటి వాస్తవాలను జీ న్యూస్ ధృవీకరించడం లేదు.