Reason behind snakes two tongues: పాములకు రెండు నాలుకలు ఉంటాయి. ఇది కోపంతో బుసలు కొడుతూ పదే పదే బైటకు తీస్తుంది. ఇది మనం తరచుగా గమనిస్తుంటాం.అయితే పాములకు రెండు నాలుకలు ఉండటం వెనుక కొన్ని పురాణకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
1/6సాధారణంగా ఎలుకలు, కప్పలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తాయి. పాముల్ని చూడగానే చాలా మంది స్నేక్ సొసైటీలకు సమాచారం ఇస్తారు. మరికొంత మంది పాములతో ఏం చక్కా రీల్స్ చేస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు.
2/6పాములు తమకు ఎదురుగా శత్రువు కన్పించినప్పుడు వెంటనే పగడ పైకి ఎత్తి కోపంతో నాలుక బైటకు తీసి బుసలు కొడుతుంది. దీన్ని ఎదుటి వాళ్లు కనుక గుర్తించి అలర్ట్ అయితే పాము కాటు నుంచి బైటపడొచ్చు. అయితే.. పాములకు రెండు నాలుకలు ఉంటాయి. దీని వెనుకాల ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. కశ్యప రుషి భార్యలైన వినత, కద్రువ ఇద్దరు తోడి కోడల్లు. వినతను చూసి కద్రువ ఒర్చుకునేది కాదు.
3/6దీంతో ఒకసారి బైటకు వెళ్లినప్పుడు పందెం కాస్తుంది. దూరంగా వీరికి ఒకగుర్రం కన్పిస్తుంది. దాని తోక నల్లగా ఉందని కద్రువ, వినతకు చెబుతుంది. కానీ వినత అంగీకరించదు. దీనికి కద్రువ దగ్గరకెళ్లి చూద్దామని పందెం వేస్తుంది. ఒకవేళ ఓడిపోతే.. తనకు వినత జీవితాంతం దాస్యం చేయాలని చెప్తుంది.
4/6కద్రువకు నాగులు సంతానం.తన కుమారుడు తక్షకుడ్ని మనస్సులో గుర్రం తోక దగ్గర ఉండాలని చెబుతుంది. తక్షకుడు పాము నల్లగా ఉండి, గుర్రం తోక భాగంలోవెళ్లి తోకలా మారతాడు. దీంతో గుర్రం తోక దగ్గర నల్లగా కన్పించడంతో వినత ఓడిపోతుంది.అప్పటి నుంచి దాసిగా సేవలు చేస్తుంది.
5/6వినతకు గురుత్మంతుడు కొడుకు. తన తల్లి దాస్యం ఏవిధంగా పొగొట్టాలని కద్రువకు అడగ్గా.. స్వర్గంలో నుంచి అమృతం తీసుకుని వస్తే.. నీ తల్లికి దాస్య విముక్తి కల్గిస్తానని చెప్తుంది. దీని వల్ల తన బిడ్డలకు అమరత్వం కల్గుతుందని కద్రువ ప్లాన్. గరుత్మంతుడు దేవతలతో పోరాడి.. అమృతంను భూమి మీదకు తీసుకుని వస్తాడు.
6/6ఆతర్వాత దేవతల కోరిక మేరకు... పాములకు ఈ అమృతం దక్కొద్దని తిరిగి ఇంద్రుడికి అప్పగిస్తాడు. ఈ క్రమంలో కొన్ని బిందువులు నదీతీరాన ఉంటే దర్భల మీద పడతాయి. దీంతో కద్రువ సంతానమైన నాగులు అన్ని వేగంగా వెళ్లి దర్భల మీద తమ నాలుకతో అమృతం కోసం నాకుతాయి. అప్పుడు దర్భలు పదునుగా ఉండటం వల్ల వాటి నాలుక రెండుగా చీలిపోతుంది. తన తల్లిని అకారణంగా దాసిగా ఉంచినందుకు, కడుపులో ఇలాంటి విషపు ఆలోచన కల్గిఉన్నందుకు.. గరుత్మంతుడు.. కద్రువ సంతానం నాలుకలు ఇక నుంచి రెండుగా చీలి ఉంటాయని శపిస్తాడు. అందుకు అప్పటి నుంచి సర్పజాతీకి రెండు నాలుకలు ఉంటాయి.