Soaked Figs Benefits: ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉంటాయి. వైద్యుల ప్రకారం నానబెట్టిన ఫిగ్స్‌తో నమ్మలేని ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర్‌లోని మెగ్నీషియం ఎముక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
గింజలు విత్తనాలు ఆరోగ్యకరం. వీటిని డైట్‌లో చేర్చుకుంటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం. అయితే, నానబెట్టిన అంజీర్ తింటే కూడా బోలెడు లాభాలు కలుగుతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బదులుగా గింజలు నానబెట్టి తినాలి. అదేవిధంగా అంజీర్ చేర్చుకుంటే ఆరోగ్యకరం. ఇది రోజంతటికీ కావాల్సిన శక్తి కూడా అందిస్తుంది.
అంజీర్ పండ్లు ఒక సూపర్‌ఫుడ్ అని చెప్పాలి. ఈ పండ్లని రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ఖనిజాలు కూడా అందుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది
అంజీర్ పండ్లతో చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. బరువు పెరగకుండా కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయంపాటు కల్పిస్తుంది.
అంజీర్ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది. ముఖం కాంతివంతంగా చేస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అంజీర్‌లోని మెగ్నీషియం ఎముక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)