Add Zee Business As A Preferred Source
App

Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌లో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ.. ఫొటోలు వైరల్..!

Written ByAruna Maharaju
Published: Oct 09, 2025, 12:06 PM IST|Updated: Oct 09, 2025, 12:06 PM IST

Actress Sobhita Dhulipala: అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, హీరోయిన్ శోభితా ధూళిపాళ.. గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ తర్వాత  ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్న శోభితా.. తాజాగా మోడ్రన్ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభితా.. తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేయగా.. కేవలం కొద్ది క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. 

Sobhita Dhulipala Latest Photo Shoot1/5

అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. రామన్ రాఘవన్ అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత.. బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. ఇక తెలుగులో మేజర్, గూఢాచారి సినిమాల్లో నటించిన శోభితా.. పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ మెప్పించింది.    

Sobhita Dhulipala Latest Photo Shoot2/5

శోభితా ధూళిపాళ ఫొటోలు

హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభితా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ తన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మ్యారేజ్ తర్వాత ఎప్పుడూ చీరలోనే కనిపించిన శోభితా.. ఒక్కసారిగా మోడ్రన్ డ్రెస్‌లో కనిపించి, ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేసింది.   

Heroine Sobhita Dhulipala3/5

శోభితా ధూళిపాళ ఫొటోలు

బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించి.. అక్కినేని అభిమానులకి షాకిచ్చింది. శోభిత తన డ్రెస్సులో కొంచెం గ్లామర్ ఎక్కువగానే చూపిస్తూ రచ్చ చేసింది. శోభిత గ్లామర్ డోస్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

Sobhita Dhulipala4/5

శోభితా ధూళిపాళ ఫొటోలు

ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ.   

Heroine Sobhita Dhulipala5/5

శోభితా ధూళిపాళ

2013లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.