Sobhita Dhulipala latest news: శోభిత ధూళిపాళ ప్రస్తుతం తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల తన భర్తతో కలిసి సమ్మర్ వెకెషన్ కు యూకేకు కూడా వెళ్లారు.ఆ ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.
శోభిత ధూళిపాళ, నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శోభిత తమ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అంతా మంచి జరిగిందని కూడా ఏకంగా నాగార్జున తన కొడలిపై ప్రశంసలు సైతం కురిపించారు.
అయితే..శోభిత తరచుగా ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. సమంతతో చైతు విడిపోయాక.. కొన్నిరోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా చైతుకు, శోభితతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చైతులు, శోభితలు పెళ్లికి ముందు తరచుగా ముంబైలో కలుసుకునేవారు.
పెద్దల అంగీకారంలో చైతు, శోభితలో కొద్ది మంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహా బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం శోభిత గూఢచారి 2 సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శోభితకు చెందిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా సెలబ్రీటీల పర్సనల్ లైఫ్ లకు చెందిన లవ్, రోమాన్స్, డేటింగ్ లకు చెందిన అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ క్రమంలోచైతు శోభితతో పెళ్లికి ముందే మరోకర్ని లవ్ చేసిందంట. ఈ విషయాన్ని స్వయంగా శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన కాలేజీ డేస్ లో తన ఫస్ట్ క్రష్ స్టార్ట్ అయ్యిందని మాట్లాడారు.
తన కాలేజీలోని సీఆర్ సార్ అంటే తనకు చాలా క్రష్ గా ఉండేదని.. ఆయన కళ్లలో పడేందుకు ప్రతిరోజు క్లాసులో ముందు కూర్చునేదాన్నని.. ప్రాక్టికల్స్ లో పదే పదే డౌట్ లు అడిగి.. ఆయన అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించేదాన్నని శోభిత చెప్పారు.
అయితే.. ఆతర్వాత అనుకొని విధంగా తాను రియలైజ్ అయినట్లు నటి పేర్కొన్నారు. అదంతా ఏజ్ వల్ల వచ్చిన ఆకర్షణ అని.. నిజంగా ప్రేమ కాదని తెలుసుకున్నట్లు నటి శోభిత చెప్పారు. ఈ క్రమంలో చైతుతో మాత్రం.. తాను మనస్పూర్తిగా లవ్ లో పడ్డానని కూడా చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నామని కూడా శోభిత చెప్పుకొచ్చారు.