Sobhita Dhulipala: చీరలో మహాలక్ష్మిలా శోభిత ధూళిపాళ .. ఫోటోలు చూసేయండి..!

Actress Sobhita Dhulipala: అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, హీరోయిన్ శోభితా ధూళిపాళ.. హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్ తర్వాత ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది శోభితా. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న శోభిత.. పట్టుచీరలో మెరిసిపోయింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 /5

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. రామన్ రాఘవన్ అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత.. బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. 

2 /5

ఇక తెలుగులో మేజర్, గూఢాచారి సినిమాల్లో నటించిన శోభితా.. పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ మెప్పించింది. పెళ్లి తర్వాత కాస్తా గ్యాప్ తీసుకుంది ఈ నటి.

3 /5

నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభితా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ తన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మ్యారేజ్ తర్వాత అప్పుడప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతుంది శోభిత.   

4 /5

ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ.   

5 /5

2013లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.