Sobhita Dhulipala: ఆరు సంవత్సరాల నాటి విషయాలను బయటపెట్టిన శోభిత..

Sobhita Dhulipala latest news 
నాగచైతన్య, శోభిత ధూళిపాల.. పెళ్లి గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఈ జంట ప్రస్తుతం హనీమూన్‌ను ఆస్వాదిస్తోంది.  ఈ క్రమంలో శోభిత పెట్టిన ఇంస్టాగ్రామ్ ఫోటో తెగ వైరల్ అవుతుంది..

1 /5

అక్కినేని కుటుంబానికి కోడలిగా శోభిత ధూళిపాల ఈ మధ్యనే అడుగుపెట్టింది. గతంలో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాత, ఆయన జీవితం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా, నాగచైతన్య - శోభితల నిశ్చితార్థం, పెళ్లి చాలా వేగంగా పూర్తయ్యాయి.  

2 /5

పెళ్లి తర్వాత కూడా శోభిత తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూ, భర్త సినిమాలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ మధ్యనే నాగచైతన్య తండేల్ చిత్రంతో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం అనంతరం జరిగిన వేడుకలో నాగచైతన్యతో.. కలిసి హాజరై అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చైతూతో ఉన్న ఫోటోలను పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి.

3 /5

తండేల్ మూవీ విజయాన్ని జరుపుకుంటూ..ఈ కొత్త జంట హనీమూన్ టూర్‌కు వెళ్లారు. ప్రస్తుతం శోభిత తన భర్తతో సమయం గడుపుతూ, భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, దేశంలోని ప్రముఖ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆమె, ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌ను అంగీకరిస్తోంది.  

4 /5

కాగా ఈ నేపథ్యంలో..శోభిత ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌కు ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆమె గత జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. ఈ సిరీస్‌లో తన పాత్ర, సహ నటీనటుల అనుభవాలను పంచుకుంటూ, ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌కు మైలురాయి అని తెలిపింది. 

5 /5

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘రామన్ రాఘవన్ 2.0’ సినిమాతో శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ‘గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. అనంతరం ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.