Add Zee Business As A Preferred Source
App

Sobhita: శోభితాకి గుండా.. నిజం బయట పెట్టిన హీరోయిన్!

Written ByVishnupriya
Published: Sep 06, 2025, 10:14 AM IST|Updated: Sep 06, 2025, 10:14 AM IST

Sobhita Hair: అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాల తాజాగా ఒక నెటిజన్ కి ఇచ్చిన సమాధానం చూసి పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె ధైర్యంగా తనకి గుండు అంటూ ఒక కామెంట్ పెట్టింది.. అసలు శోభిత ఇంతకీ నిజం బయటే ఎందుకు పెట్టింది అన్న విషయంలోకి వెళితే..
 

Sobhita Wig 1/5

శోభిత హెయిర్

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శోభిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న  తర్వాత ఈమె పేరు మరింత ఎక్కువగా వినిపిస్తోంది. సమంతకు విడాకులు ఇచ్చి శోభితాను చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వివాహమనంతరం శోభిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు విభిన్నమైన పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. 

Sobhita Shocking Revelation2/5

శోభిత హెయిర్

అంతేకాకుండా నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేస్తూ ఉంటుంది శోభిత. ఇదిలా ఉండగా ఇటీవలే శోభిత సినిమా షూటింగ్ సెట్ లో వంట చేస్తూ ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. ఈ ఫోటోల పై నాగచైతన్య కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఒక నెటిజన్ ఈ ఫోటోలకు ఇలా కామెంట్స్ చేస్తూ.. "మేడం కొన్నిసార్లు మీ హెయిర్ వేవ్ గా, కొన్నిసార్లు సడన్గా స్ట్రైట్ గా అలా ఎలా మారుస్తున్నారు. నాచురల్ గా మీ హెయిర్ వేవ్ ఆ ఎలానో చెప్పండి ప్లీజ్ అంటూ కామెంట్ చేశారు".

Sobhita Viral Post 3/5

శోభిత హెయిర్

అందుకు శోభిత విభిన్నంగా సమాధానాన్ని తెలియజేస్తూ నాచురల్ గా గుండు అంటూ సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శోభిత చేసిన ఈ కామెంట్స్ కి మరొక నెటిజన్ హెయిర్ తోనే నిన్ను చూడలేము.. ఇక గుండుతో అయితే వామ్మో కష్టమే బుజ్జి తల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు.   

Sobhita Viral Post 4/5

శోభిత హెయిర్

మొత్తానికి శోభిత నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా విభిన్నమైన సమాధానం చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది. 

Sobhita Hair 5/5

శోభిత హెయిర్

ఇటీవలే తిరిగి మళ్ళీ శోభిత పలు సినిమాలలో నటించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక సినిమా డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసింది.