Add Zee Business As A Preferred Source
App

Soft Tasty Idli: నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి మెత్తని ఇడ్లీలు ఎలా చేసుకోవాలంటే..

Written ByVishnupriya
Published: Sep 02, 2025, 09:01 PM IST|Updated: Sep 02, 2025, 09:01 PM IST

Tasty Soft Idly 
సాధారణంగా ప్రతిరోజు.. తెలుగువారింట్లో ఎక్కువగా టిఫిన్ గా ఇడ్లీలే ఉంటాయి. వారానికి కనీసం నాలుగు రోజులైనా టిఫిన్ ఇడ్లీ ఉండడం ఖాయం. మరి అలాంటి ఇడ్లీలు రాయి లాగా కాకుండా.. ఎంతో సాఫ్ట్ గా .. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా రావాలంటే ఎలా చేసుకోవాలో తెలుసా..

Tasty Idli 1/5

సౌత్ ఇండియన్ టిఫిన్,

నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి ఇడ్లీలు చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పే చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి చాలు..

Required Ingredients 2/5

కావలసిన పదార్థాలు

ఉద్దిపప్పు రెండు కప్పులు.. పచ్చి బియ్యం రెండు కప్పులు.. ఉప్పుడు బియ్యం నాలుగు కప్పులు‌‌.. అటుకులు రెండు స్పూన్లు..

Preperation of Soft Idly 3/5

ఇడ్లీ పిండి రెసిపీ

పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపి రాత్రి మొత్తం నీళ్లలో నానబెట్టుకోవాలి‌ . ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని గ్రైండర్లో లేదా మిక్సీలో వేసుకొని ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి. 

Puffy Tasty Idly 4/5

టేస్టీ ఇడ్లీ తయారీ,

ఇప్పుడు ఈ పిండిని.. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు లాగా పెట్టి.. కనీసం 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం పెట్టుకునేది ఇడ్లీలు కాబట్టి ఈ పిండి మరీ జారుగా కలుపుకోకూడదు.   

Tasty Puffy Idli 5/5

, మెత్తని ఇడ్లీ ఎలా చేయాలి,

ఇక 15 నిమిషాల తర్వాత.. స్టవ్ కట్టేసి వెంటనే తీయకుండా కాసేపు ఆ ఇడ్లీలను ఆరనివ్వాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఏదైనా కూసుగా ఉండే స్పూన్ ని నీళ్ళల్లో తడుపుకొని ఇడ్లీలు తీసుకొని ప్లేట్లో వేసుకొని.. ఎలాంటి చట్నీతో తిన్నా అదరహో అనాల్సిందే..