Puffy Gulab Jaman : చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా గులాబ్ జామ్ అంతే చాలు.. ఎగిరి గంతేసి తింటారు. మరి అలాంటి గులాబ్ జామ్ ని ఎంతో రుచిగా ముఖ్యంగా ఎంతో సాఫ్ట్ గా చేసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఇది చదివేయండి..
1/6ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఇంట్లో చుట్టాలు వచ్చినా.. మనం సులువుగా చేయగలిగే స్వీట్ గులాబ్ జామ్. కేవలం 10 నుంచి 20 నిమిషాల లోపల ఈ స్వీట్ ని చేసేయొచ్చు. మరి ఈ స్వీట్ మరింత రుచిగా చేసుకోవాలంటే.. ఏం చేయాలంటే..
2/6గులాబ్ జామ్ పౌడర్ : రెండు కప్పులు, చక్కెర: రెండు కప్పులు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్ కొద్దిగా నీళ్లు, నూనె
3/6ముందుగా గులాబ్ జామున్ పౌడర్ని కొద్దిగా నెయ్యి.. నీళ్లు వేసుకొని బాగా మృదువుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని..ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టాలి. ముఖ్యంగా ఈ పిండిని నెయ్యితో కలుపుకోవడం వల్ల గులాబ్ జాములు ఎంతో మెత్తగా వస్తాయి.
4/6ఇప్పుడు స్టవ్ పైన.. బాణీలో రెండు కప్పుల షుగర్.. రెండు కప్పుల నీళ్లు తీసుకుని.. ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి.
5/6ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని.. కాగుతున్న నూనెలో.. సన్నని మంట మీద గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
6/6ఇలా వేయించుకున్న గులాబ్ జామున్ లను.. ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో ఒక అరగంట పాటు ఉండనివ్వాలి..ఆ తర్వాత ఐస్ క్రీమ్ తో పాటు జామున్ వేసుకొని గార్నిష్ కి బాదం పప్పులు వేసుకొని.. సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ.