Puffy Rava Idli: సాధారణంగా ఇడ్లీ పిండితో చేసే ఇడ్లీనే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే రవ్వతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు. రవ్వతో చేసిన ఇడ్లీలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్లకు ఈ ఇడ్లీలు బెస్ట్ ఆప్షన్.. ఇవి ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గాలి అనుకున్న వాళ్లకు పిండి ఇడ్లీ కన్నా కూడా రవ్వ ఇడ్లీ చాలా మంచిది. అయితే రవ్వ ఇడ్లీ గట్టిగా వస్తుంది అనే అపోహ మీలో ఉంటే ఇప్పుడు చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి.. అప్పుడు ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది..
బొంబాయి రవ్వ : 1 కప్పు, కొద్దిగా పుల్లగా ఉంది పెరుగు: 1 కప్పు, నీళ్లు: అర కప్పు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు ఈనో (ఫ్రూట్ సాల్ట్)
ముందుగా రవ్వ ను.. కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా.. రవ్వ ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది.
ఇప్పుడు వేయించిన రవ్వను బాగా చల్లార్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక కప్పు పెరుగు, అర టీస్పూన్ ఉప్పు, అర కప్పు నీళ్లు కలుపుకుంటూ ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిని.. పిండిని 10-15 నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నీళ్లను పీల్చుకుంటుంది.
ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో వీటిని ఇడ్లీలు లాగా పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. స్టవ్ ఆపేశాక ఐదు నిమిషాలు అలానే ఉందని ఇచ్చి ఆ తర్వాత ఇడ్లీలు వడ్డించుకుంటే.. ఎంతో రుచికరమైన మెత్తగా ఉండే రవ్వ ఇడ్లీ రెడీ.