Add Zee Business As A Preferred Source
App

Software Engineer Weight Loss: ఒక చిన్న ప్రయోగం చేసి 10 కేజీలు బరువు తగ్గిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఎలాగంటే..!

Written ByVishnupriya
Published: Sep 08, 2025, 03:46 PM IST|Updated: Sep 08, 2025, 03:46 PM IST

Weight Loss: బరువు తగ్గటం అనేది సులభమైన పని మాత్రం కాదు. ఒక్క కేజీ బరువు తగ్గాలి అన్న కానీ ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. అయితే కరెక్ట్ పద్ధతిలో చేస్తే మాత్రం.. బరువు తగ్గడం అనేది వెళ్లే కొద్ది సులభం అవుతుంది. ఇక తను పాటించిన పద్ధతిని ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేర్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది..

ChatGPT Fitness Plan1/5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెయిట్ లాస్

బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా డెడికేషన్ ఉండాలి. కేవలం ఒకటి లేకపోతే రెండు రోజుల లోపల బరువు తగ్గాలి అనుకుంటే అది మన అపోహ మాత్రమే అవుతుంది. అంతేకాకుండా అంత సులభంగా బరువు తగ్గితే.. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేకపోతే.. మళ్లీ త్వరగా బరువు పెరిగిపోవడం లాంటివి జరుగుతాయి. 

Weight Loss Tips2/5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెయిట్ లాస్

అందుకే సరైన పద్ధతులు పాటించి మాత్రమే బరువు తగ్గాలి. అయితే అలాంటి పద్ధతులు మనకు చెప్పడానికి ఫిట్నెస్ కోచ్ ఉండాలి. ఇక ఫిట్నెస్ కోచ్ కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇలా ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. పద్మజ అనే అమ్మాయి ఏకంగా 10 కేజీలు తగ్గిందంట. 

ChatGPT Health Guide3/5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెయిట్ లాస్

దీనికోసం ఆమె చేసిందల్లా.. చాట్ జిపిటి కి కొన్ని కమాండ్లు ఇవ్వడం మాత్రమే. ముందుగా ఆమె వెయిట్, హైట్, వయసు.. ఆమె ఎటువంటి ఆహారాలు తింటుంది అనేది మొత్తం చాత్ జిపిటికీ ఇచ్చిందంట. 

Simple Diet Plan4/5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెయిట్ లాస్

ఆ తరువాత తను ఎన్ని రోజుల్లో ఎన్ని కేజీలు తగ్గాలి అనుకుంటుంది కూడా Prompt ఇచ్చింది. తను రెండు నెలల్లో 10 కేజీలు తగ్గాలి అనుకుంటున్నాను అని..ప్రాంప్ట్ ఇచ్చింది. 

Weight Loss Success Story5/5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెయిట్ లాస్

అంతేకాకుండా తన దగ్గర డంబల్స్ లేదా రెసిస్టెన్స్ బాండ్స్.. లేకపోతే క్రాస్ ట్రైనర్స్ ఉన్నాయా.. లేకపోతే కేవలం ఎక్సర్సైజులు మాత్రమే చేయగలనా అనేది కూడా చెప్పిందంట. ఇక వెంటనే చాట్ జిపిటి రెండు నెలలు తన ప్లాన్ మొత్తం ఏమి చేయాలి, అనేది ఏమి తినాలి అనేది క్లియర్గా ఇచ్చింది. ఇవన్నీ ఫాలో అయ్యి తను రెండు నెలల్లో 10 కేజీలు తగ్గాను అని చెప్పుకొచ్చింది ఆ ఇంజనీర్.