First Solar Eclipse Effect On Zodiac Signs: మొదటి పాక్షిక సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి మార్చి 29వ తేది నుంచి అనేక సమస్యలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి.
First Solar Eclipse Effect On Zodiac: చంద్రగ్రహణం తర్వాత అతి త్వరలోనే మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ మార్చి 29వ తేదినే ఏడాది తొలి సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అలాగే ఈ రోజు శని గ్రహం సంచారంతో పాటు చైత్య నవరాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఉత్తరభద్రపద నక్షత్రంలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై అశుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మొదటి సూర్యగ్రహణం పాక్షికంగా ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:21 నుంచి ప్రారంభం కాబోతోంది. దాదాపు మూడు గంటల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. మొదటి గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం కూడా చెల్లబాటు అవ్వదు. కొన్ని రాశులవారికి ఈ సమయంలో సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ కారణంగా తుల రాశివారికి అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కెరీర్, ఉద్యోగాల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనేక పనులకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బడ్జెట్ పరంగా కూడా ఖర్చు చేయడం చాలా మేలు.
మేష రాశి వారి వారికి కూడా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారుతాయి. వీరు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. దీంతో పాటు నిర్లక్ష్యంగా పనులు చేయడం మంచిది కాదు.. ఇతరుల మాట్టాడే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైన జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
సూర్యగ్రహణం సమయంలో ధనుస్సు రాశివారికి కూడా అనేక సమస్యలు వస్తాయి. వీరికి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు రావచ్చు. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. దీంతో పాటు భారీ మొత్తంలో లాదాదేవీలు చేసేవారు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
సూర్యగ్రహణం ఎఫెక్ట్ వల్ల కర్కాటక రాశివారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో ఖర్చులపై పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో వాదనలు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు వస్తాయి. వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అలాగే ఒత్తిడితో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.