Add Zee Business As A Preferred Source
App

Sony Xperia 1 Vii Price: సోనీ నుంచి గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి ఎక్స్‌పీరియా 1 VII ఫోన్..

Published: Aug 23, 2025, 01:52 PM IST|Updated: Aug 23, 2025, 01:52 PM IST

Sony Xperia 1 Vii Price In India: భారత మార్కెట్లోకి అతి త్వరలోనే సోనీ కంపెనీ నుంచి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం లుక్కులో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దీని ధర రూపాయలు లక్ష నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.. 

Sony Xperia 1 Vii Price In India: గతంలో సోనీ మొబైల్స్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉండేది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత శక్తివంతమైన కెమెరాలతో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తూ ఉండేవి. చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపేవారు. ముఖ్యంగా అప్పట్లో యువతైతే సోనీ మొబైల్స్‌ను విచ్చలవిడిగా కొనుగోలు చేసేవారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గతంలో కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన కెమెరా మొబైల్స్ ను విడుదల చేసేది.. కానీ కొన్ని కారణాలవల్ల మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్స్‌ను విక్రయించడం కంపెనీ తగ్గించుకుంటూ వచ్చింది.
 

Sony Ericsson Android Phone1/5

కెమెరా సెటప్‌

మార్కెట్లో కొన్ని చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు విడుదల చేస్తున్న స్మార్ట్ ఫోన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సోనీ కంపెనీ మరో ముందడుగు వేసింది. అతి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో శక్తివంతమైన ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Sony Xperia Latest Phone2/5

సోనీ కంపెనీ

ఈ స్మార్ట్ ఫోన్ను సోనీ కంపెనీ Sony Xperia 1 VII పేరుతో విడుదల చేయబోతున్నట్లు మే 13వ తేదీన ప్రకటించింది. అయితే ఈ మొబైల్‌ను కంపెనీ ఇప్పటికి ఎప్పుడు భారత మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో విడుదల చేసేది. కానీ కొన్ని కారణాలవల్ల విడుదల తేదీని ప్రకటించలేకపోయింది. అతి త్వరలోనే ఈ మొబైల్‌పై అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

Sony Xperia 1 Iv3/5

కలర్ ఆప్షన్స్‌

ఈ Xperia 1 VII స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది స్టోరేజ్ వేరియంట్ను బట్టి ధరను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీని ధర భారత్ లో రూ.1 లక్ష నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

Sony Xperia India4/5

బ్యాటరీ

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ దీనిని అత్యంత శక్తివంతమైన 6.5-అంగుళాల 4K OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీని డిస్ప్లే 120 Hz రిఫ్రెష్‌తో వస్తోంది. అలాగే ఇది 5,000 mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం..  

Sony Xperia 1 Vii5/5

కెమెరా సెటప్

ఈ మొబైల్‌ను ఫాస్ట్ ఛార్జింగ్ చేసేందుకు కంపెనీ పవర్ఫుల్ 45 W ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్ వెనుక భాగంలోని 48 MPతో ట్రిపుల్ కెమెరా సెటప్ తో విడుదల కాబోతోంది.