Soundarya husband letter: సౌందర్యను హత్య చేయించింది మోహన్ బాబు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో అనేక కథనాలు వార్తలలో నిలిచాయి. ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏకంగా కలెక్టర్ కు లేఖను రాసి.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
మోహన్ బాబు మాత్రం ఇటీవల తరచుగా వివాదాలలో వార్తలలో ఉంటున్నారు. ఒకవైపు ఆయన కొడుకు మంచు మనోజ్ తో ఆస్తుల గొడవల రచ్చ నడుస్తునే ఉంది. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి ఆయన్ను వెంటాడుతు ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు బెయిల్ మీద ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా.. నటి సౌందర్య మరణం వార్త అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఖమ్మంకు చెందిన వ్యక్తి సౌందర్య హత్యకు కుట్ర చేసింది మోహన్ బాబు అంటూ బాంబు పేల్చాడు. అతను ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి మరీ ఫిర్యాదు చేయడంతో పాటు, తనకు ప్రాణహనీ ఉందని పోలీసులకు తన గొడును చెప్పాడు.
సౌందర్య డెట్ మిస్టరీ మరోసారి ఇటు రాజకీయాల్లోను, అటు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిన్న మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అయితే.. మోహన్ బాబుసై వచ్చిన ఆరోణపణలపై తాజాగా.. నటి సౌందర్య భర్త రఘు రియాక్ట్ అయ్యారు.
తన భార్య హత్యకు ప్లాన్ జరిగిందని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. అంతే కాకుండా.. ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబుతో తమ కుటుంబానికి 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని.. ఏనాడు ఏ విషయంలోను తమకు బేధాభిప్రాయాలు రాలేదన్నారు. జల్ పల్లిలోని భూముల గొడవ ఉందనడం, మోహన్ బాబు ఆక్రమించుకున్నారనడంతో వాస్తవం లేదన్నాడు.
దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని కూడా సౌందర్య భర్త రూమర్స్ వేళ ఏకంగా బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మంకు చెందిన వ్యక్తి వెనుకాల ఎవరైన ఉండి.. ఇదంతా నడిపిస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికైతే మోహన్ బాబుకు కాస్తంత ఉపశమనం లభించిందని చెప్పుకొవచ్చు.