Scr special trains to sabarimala: శబరిమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కల్గకుండా రైల్వేశాఖ పలుకీలక నిర్ణయాలు తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో రెండు తెలుగు స్టేట్స్ ల నుంచి ఏకంగా 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరి మలకు చాలా మంది ప్రతిఏటా భక్తులు వెళ్తుంటారు. చాలా మంది మాలలు ధరించి మండలం రోజులు అయ్యప్పస్వామికి భక్తితో పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత మకర సంక్రాంతి వేళ శబరి మలకు వెళ్లాలని ప్లాన్ లు చేసుకుంటారు.
శబరి మలకు తెలుగు స్టేట్స్ నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కొకొల్లలుగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిఏటా శబరిమలకు వెళ్తున్న భక్తులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు స్టేట్స్ ల నుంచి 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోందని వెల్లడించింది. ముఖ్యంగా..
డిసెంబర్ నుంచి జనవరి వరకుఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. నవంబర్ 14 నుంచి జనవరి 21 ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడ్పిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిలో.. చర్లపల్లి, కాచిగూడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం నుంచి కొల్లం, కొట్టాయం వరకు సర్వీసులు ఉంటాయని తెలిపారు.. ఈ ట్రైన్స్ లో ప్రయాణించాలను కునే అయ్యప్ప భక్తులు.. నేటి నుంచి ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
మరోవైపు శబరి మలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నందుకు అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ లు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే శబరి మలకు వెళ్లడానికి బుక్కింగ్ కూడా పలు రైళ్లలో చేసుకున్నారు. తాజాగా.. మరో 60 రైళ్లు నడిపిస్తున్న నేపథ్యంలో భక్తులు మరింతగా శబరిమలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.