South Central Railway Notification: టెన్త్, ఇంటర్ చదివి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారా..? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. దక్షిణమధ్య రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో గ్రూప్–సి, గ్రూప్–డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
1/5దక్షిణ మధ్య రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. వీటిలో గ్రూప్-సి కింద 2, గ్రూప్-డి కింద 10 పోస్టులు ఉన్నాయి.
2/5ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు ఇప్పటికే సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కాగా.. చివరి తేదీ అక్టోబర్ 19 వరకు ఉంది.
3/5గ్రూప్-సి పోస్టులకు 12వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. గ్రూప్-డి పోస్టులకు 10వ తరగతి లేదా ఐటీఐ లేదా ఎన్‌ఏసీ ఉత్తీర్ణత అవసరం. గరిష్ఠ వయసు 33 సంవత్సరాలు. కొన్ని వర్గాలకు వయసులో సడలింపు ఉంటుంది.
4/5దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ, మైనార్టీలు, ఈబీసీ వారికి 250 రూపాయలు కాగా.. ఇతరులకు 500 రూపాయలు ఉంది.
5/5రాత పరీక్ష, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు iroams.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.