South Highest Paid Actress: సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్.. బాలీవుడ్ భామలు కూడా ఈమె తర్వాతే..

South Highest Paid Actress: సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో చిత్రానికి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నహీరోయిన్. ఈమె పారితోషికం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్స్ కంటే ఎక్కువ. ఇంతకీ సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోయిన్ పారితోషికం చూసి బాలీవుడ్ భామలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. 

 

1 /10

South Highest Paid Actress: ఒకప్పటిలా ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీని దక్షిణాది భామలు దున్నేస్తున్నారు. ఒకపుడు వైజయంతి మాల, వహీదా రెహమాన్, హేమా మాలిని, శ్రీదేవి, జయప్రద, రేఖ వీళ్లంత దక్షిణాది నుంచి హిందీ సినీ పరిశ్రమను ఏలారు. తాజాగా రష్మిక మందన్న,నయనతార, పూజా హెగ్డే వంటి వారు నార్త్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం దీపికా కర్ణాటక చెందిన భామ కావడం గమనార్హం.

2 /10

సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల ప్రభావం ప్యాన్ ఇండియా రేంజ్ లో పెరుగుతోంది.  వీరి పారితోషికం మీడియం రేంజ్ హీరోలకన్నా ఎక్కువగా ఉంటుంది.  నయనతార, రష్మిక మందన్న, త్రిష, సమంత, సాయి పల్లవి వంటి స్టార్ నటీమణులు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

3 /10

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు.  ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. రష్మిక  ఒక్కో చిత్రానికి దాదాపు ₹13 కోట్లు పారితోషికం అందుకుంటుంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రష్మిక రేంజ్ పెరిగింది.

4 /10

త్రిష కృష్ణన్..  2 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది త్రిష.  ఇప్పటికీ అనేక భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న “విశ్వంభర” చిత్రంలో నటిస్తోంది. ఈ  సినిమా కోసం  ₹12 కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. 

5 /10

నయనతార.. లేడీ సౌత్ సూపర్ స్టార్ నయనతార..షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’  చిత్రంలో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  ప్రస్తుం నయన.. ఒక్కో చిత్రానికి ₹6 నుండి ₹10 కోట్లు సంపాదిస్తోంది. చిరంజీవితో చేస్తోన్న ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమా కోసం ₹10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.

6 /10

సమంత..  ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులు సినిమాలకు విరామం  తీసుకున్న సమంతా ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో పలకరించబోతుంది. ఈమె ఒక్కో చిత్రానికి ₹5 నుండి ₹8 కోట్లు పారితోషికం అందుకుంటోంది.   

7 /10

అనుష్క శెట్టి..  బాహుబలి ఫేమ్ అనుష్క శెట్టి ప్రతి చిత్రానికి ₹4 నుండి ₹5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘ఘాటి’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.  

8 /10

శృతి హాసన్ ..  శృతి హాసన్ .. సలార్ మూవీతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ‘కూలీ’  సినిమా కోసం ఒక్కో చిత్రానికి ₹5 నుండి ₹6 కోట్లు అందుకుంటోంది. 

9 /10

సాయి పల్లవి..  ఈ యేడాది ‘తండేల్’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. తాజాగా చేస్తోన్న ‘రామాయణం’ సినిమా కోసం రూ. 6 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. 

10 /10

తమన్నా భాటియా ..  తమన్నా.. హీరోయిన్ గా... ఐటెం భామగా నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ లో అదరగొట్టేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా కి ₹4 నుండి ₹5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.