Star Actress: తెలుగు తెరపైన స్టార్ హీరోయిన్.. తెరవెనుక మాత్రం నరకం.. ఆఖరికి చావు వరకు..!

Telugu Herione: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా.. గుర్తింపు పొందిన ఆర్తి అగర్వాల్ సినీ ప్రయాణం ఎంత స్టార్ స్టేటస్ గా సాగిందో, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అంతకు విరుద్ధంగా సాగింది. బాలీవుడ్‌లో ప్రారంభమై, టాలీవుడ్‌లో విజయాన్ని అందుకున్న ఆమె చివరికి అనుకోని విధంగా కన్నుమూసింది.  

1 /5

ఆర్తి అగర్వాల్ బాలీవుడ్‌లో 16 ఏళ్ల వయసులో 'పాగల్‌పాన్' అనే చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించింది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు తెలుగు సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'తో వచ్చింది. వెంకటేష్ సరసన నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, ఆర్తి అగర్వాల్‌ను టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ చేసింది. 

2 /5

ఆర్తి అగర్వాల్ చిరంజీవితో 'ఇంద్ర', మహేష్ బాబుతో 'బాబీ', బాలకృష్ణతో 'పల్నాటి బ్రహ్మనాయుడు', నాగార్జునతో 'నేనున్నాను', ప్రభాస్‌తో 'అడవి రాముడు', జూనియర్ ఎన్టీఆర్‌తో 'నరసింహుడు' వంటి హిట్ చిత్రాల్లో నటించింది.  

3 /5

ఆర్తి అగర్వాల్ కెరీర్ గాడిలో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. 2005లో ఆమె వ్యక్తిగత సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురైంది. అప్పటి కొన్ని పుకార్లు, వ్యక్తిగత సమస్యలు ఆమెను ఆత్మహత్యాయత్నానికి కూడా దారి తీశాయి.  

4 /5

ఆమె 2007లో ఉజ్వల్ నికమ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కానీ వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలువలేదు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ప్రయత్నించింది.  

5 /5

2015లో ఆర్తి అగర్వాల్ లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఊహించని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె జూన్ 6, 2015న కేవలం 31 ఏళ్ల వయసులో మృతి చెందారు.