Star Actress: స్టార్ హీరో కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఒక నటి.. ప్రస్తుతం ఎన్నో కష్టాలు తట్టుకుని, తన స్థాయిని ఏర్పరచుకుంది. కానీ, ఆమె జీవితంలో ఓ ఘట్టం అత్యంత ఎమోషనల్‌గా సాగింది అని ఈ మధ్య జరిగిన ఒక రియాల్టీ షోలో చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. అతని కూతురు ఎవరు అనే విషయం ఒకసారి చూద్దాం..
శరత్‌కుమార్ కూతురిగా జన్మించిన వరలక్ష్మి, తన తండ్రి పేరు ఆధారంగా అవకాశాలు పొందలేదు. స్వంత ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన పోడా పోడి ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, ఆ సినిమాలో డాన్సర్‌గా నటించింది. తర్వాత తారై తపట్టై, విక్రమ్ వేదా, సండకోళి 2, సర్కార్, మారి 2 వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
టాప్ హీరోయిన్‌గా కాకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ పాత్రల్లో ఈమె ఎన్నో సినిమాలలో మెప్పించింది.
వరలక్ష్మి జీవితంలో ఒక ఘట్టం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె, తన గతాన్ని నెమరువేసుకుంది. "ఇది నేను ఎప్పుడూ బయట చెప్పలేదు. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ, డబ్బు కోసం 2500 రూపాయలకు రోడ్డు మీద డాన్స్ చేయాల్సి వచ్చింది. అందరూ తప్పుగా అనుకోకండి. నా ప్రయాణం అక్కడ మొదలైంది," అంటూ తన భావోద్వేగాలను పంచుకుంది.
"కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లాలి. ఎంత కష్టం వచ్చినా నమ్మకంతో పోరాడితే విజయాన్ని సాధించొచ్చు," అని వరలక్ష్మి తన అనుభవాలను పంచుకుంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ చిత్రంలో వరలక్ష్మి నటిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేయాలని అనుకుంటోంది.