Add Zee Business As A Preferred Source
App

Diabetes: ఈ ఆకుకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధం కంటే ఎక్కువ!

Written ByRenuka Godugu
Published: Apr 26, 2025, 06:05 PM IST|Updated: Apr 26, 2025, 06:05 PM IST

Diabetes Healthy Leaves: డయాబెటిస్ వారు ప్రధానంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. డైట్ లో కొన్ని కూరగాయలు, ఆకుకూరలు చేర్చుకోవాలి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. అయితే పాలకూర డయాబెటిస్ వారికి ఎంతో మంచిది. ఇది చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అదేంటో తెలుసుకుందాం..
 

Vitamin A1/5

విటమిన్ ఏ

 పాలకూరలో విటమిన్ ఏ, ఐరన్ ఉంటుంది. ఇది ఎనిమియా సమస్యకు తక్షణ రెమిడీ. అయితే డయాబెటిస్ వారికి కూడా ఇది మంచిది. ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం ఇందులో ఉంటుంది. ఇన్సూరెన్స్ స్రావాన్నిప్రేరేపిస్తుంది. డయాబెటిస్ వారు ఈ పాలకూర డైట్ లో చేర్చుకోవాలి.   

Minerals2/5

ఖనిజాలు

 అంతేకాదు ఇందులో ఖనిజాలు, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. క్రమం తప్పకుండా ఈ ఎండ వేళ ఆకుకూరలు తినడం కూడా మధుమేహంతో పాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.   

Fiber3/5

ఫైబర్

 పాలకూరలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. తద్వారా ఆకలి వేయకుండా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కూడా ఆరోగ్యం.   

heart Healthy4/5

గుండె ఆరోగ్యం

 పాలకూర తీసుకోవడం వల్ల ఇందులో పొటాషియం, రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. తద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరను కూర లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఆకుకూర తీసుకుంటే కడుపు కూడా చల్లగా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.   

Spinach5/5

 పాలకూర

 పాలకూరలో ఉండే విటమిన్ ఏ, కాల్షియం, లుటీన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలను ఆలస్యం చేస్తాయి. కాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకలను కూడా బలపరుస్తుంది.