NTR -Chiranjeevi Same Title Movies: సినీ పరిశ్రమలో ఒకే టైటిల్ తో పలు చిత్రాలు తెరకెక్కిన సందర్భాలున్నాయి. సాధారణంగా ఓ చిత్రం విడుదలైన 10 యేళ్ల తర్వాత అదే టైటిల్ ను వేరే సినిమాలకు పెట్టే సంప్రదాయం ఉంది. అలా ఒకే టైటిల్ తో ఎన్టీఆర్, చిరంజీవి పలు చిత్రాల్లో నటించారు. అందులో పలు చిత్రాలు విషయానికొస్తే..
1/6తోడు దొంగలు..ఒకే టైటిల్ తో ఎన్టీఆర్, చిరంజీవి యాక్ట్ చేసిన తొలి చిత్రం ‘తోడు దొంగలు’. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘తోడు దొంగలు’ చిత్రాన్ని డి.యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు నిర్మించారు. 1954లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత 1981లో కృష్ణ, చిరంజీవి హీరోలుగా కే.వాసు దర్శకత్వంలో అదే టైటిల్ తో సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది.
2/6ఇంటిగుట్టు..1958లో ఎన్టీఆర్, సావిత్రి హీరో, హీరోయిన్లుగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంటిగుట్టు’. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత 1984లో చిరంజీవ హీరోగా బాపయ్య దర్శకత్వంలో ‘ఇంటిగుట్టు’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది.
3/6దేవాంతకుడు..సి.పుల్లయ్య దర్శకత్వంలో 1960లో ఎన్టీఆర్, కృష్ణకుమారి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘దేవాంతకుడు’. తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత 1984లో చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘దేవాంతకుడు’ టైటిల్ తో మరో సినిమా చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
4/6ఆరాధన..1976లో ఎన్టీఆర్, వాణిశ్రీ నాయికా, నాయికులుగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆరాధన’ చిత్రం వచ్చింది ఈ మూవీ హిందీలో వచ్చిన ‘గీత్’ చిత్రానికి రీమేక్ కావడం విశేషం. సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ ‘ఆరాధన’ తర్వాత 1987లో చిరంజీవి .. భారతీరాజా డైరెక్షన్ లో ‘ఆరాధన’ చిత్రం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
5/6తిరుగులేని మనిషి..ఎన్టీఆర్ హీరోగా నటించిన నాలుగు సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ తో చిరంజీవి నాలుగు చిత్రాలు చేశారు. అందులో ఒక్క ఆరాధన తప్ప అన్ని చిత్రాలు విజయం సాధించాయి. ఇక ఎన్టీఆర్ తోడు దొంగలు మాత్రం అంతగా విజయం సాధించలేదు. వీళ్లిద్దరు కలిసి 1981లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘తిరుగులేని మనిషి’ చిత్రంలో నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. వీళ్లదరు కలిసి నటించిన ఏకైన చిత్రం ఇదే కావడం విశేషం.
6/6ఇక ఎన్టీఆర్ 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అన్నగారి రూట్లోనే చిరంజీవి.. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ పొలిటికల్ గా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే.. చిరంజీవి మాత్రం కేవలం కేంద్ర మంత్రి అయ్యారు. అప్పట్లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయంగా తీవ్ర విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. జనసేన స్థాపించి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.