Add Zee Business As A Preferred Source
App

Sreeleela: రెడ్ కలర్ డ్రెస్ లో కిస్సీక్ పాప అందాలు అదుర్స్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Written ByTA Kiran Kumar
Published: Sep 11, 2025, 03:59 PM IST|Updated: Sep 11, 2025, 03:59 PM IST

Sreeleela: శ్రీలీల.. చాలా యేళ్ల తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న పదహారాణాల తెలుగు భామ. తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.  ప్రస్తుతం కెరీర్ పరంగా హిట్స్ లేక  రేసులో వెనకబడింది. 

Sreeleela1/5

శ్రీలీల

Sreeleela: శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన నటిస్తూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. స్టార్స్ సరసన నటిస్తున్న ఈ భామకు సరైన సక్సెస్ లు మాత్రం ఈ మధ్య రావడం లేదు. 

Kissik Papa2/5

కిస్సిక్ పాప

లాస్ట్ ఇయర్ ‘పుష్ప 2’లో చేసిన కిస్సిక్ పాప ఐటెం సాంగ్ మాత్రమే ఈమెకు పేరు వచ్చింది. అంతకు ముందు చేసిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’, గుంటూరు కారం, ఈ ఇయర్ విడుదలైన ‘రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు శ్రీలీలకు నిరాశనే మిగిల్చాయి.

Sreeleela Bad Time 3/5

శ్రీలీల బ్యాడ్ టైమ్

మొత్తంగా ప్రస్తుతం శ్రీలీలకు బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పాలి.  చేసిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో హిందీలో ‘ఆషికీ 3’, తమిళంలో ‘పరాశక్తి’ చిత్రాలతో పాటు తెలుగులో రవితేజతో  చేసిన ‘మాస్ జాతర’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే ఈమె ఆశలు పెట్టుకుంది. 

Kiss First Movie 4/5

కిస్ చిత్రంతో పరిచయం

శ్రీలీల విషయానికొస్తే.. ఈమె  కన్నడ చిత్రం ‘కిస్’ చిత్రంతో  వెండితెరకు పరిచయమైంది. ఇక తెలుగులో  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD'చిత్రంతో  తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.