Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

Sri Rama Navami 2025: రాముడు నడిచిన మార్గమే ‘రామాయణం’ అయింది. దీనికి మరో పేరు సీతాయణం. రాముడి వెంట నడిచిన ధర్మపత్ని సీత మహా దేవి కారణంగా దీన్ని సీతాయణం అని కూడా పిలుస్తారు.  ఇంతటీ అద్భుతమైన కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రతో సరిసమానైమైంది సీతమ్మ వారు.  అలాంటి అద్భుతమైన సీతమ్మ పాత్రలో నటించిన కథానాయికల విషయానికొస్తే.. 

1 /7

నయనతార  - శ్రీరామరాజ్యం.. ఇక రామాయణం కావ్యంపై  వచ్చిన మరో అద్భుత  దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’. లవకుశ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జగదేకవీరుడైన రాముడి పాత్రలో బాలకృష్ణ నటిస్తే.. నయనతార సీతమ్మ పాత్రలో ఒదిగిపోయింది. 

2 /7

ఆదిపురుష్ - కృతి సనన్.. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణాన్ని తన ఇష్టమొచ్చినట్టు వక్రీకరించి తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో  ప్రభాస్ రాఘవుడిగా నటిస్తే.. కృతిసనన్.. జానకి పాత్రలో నటించింది. ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

3 /7

జయప్రద - సీతా కళ్యాణం - హిందీ లవకుశ.. సిల్వర స్క్రీన్ పై  సీతమ్మ పాత్రలో మెప్పించిన మరో యాక్ట్రెస్  జయప్రద. బాపు డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘సీతా కళ్యాణం’. ఈ సినిమాలో  జయప్రద సీతమ్మ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఆ తర్వాత వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన  లవకుశ హిందీ రీమేక్ ‘లవకుశ్’లో ఈమె సీత పాత్రలో నటించడం విశేషం

4 /7

అంజలి దేవి - లవకుశ - వెండితెర సీతమ్మగా అంజలి దేవి రామ చంద్రుడు అంటే ఎన్టీఆర్ ఎలాగో.. వెండితెర సీతమ్మ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అంజలి దేవిది. లవ కుశ సినిమాలో సీతమ్మగా ఆమె ప్రేక్షక నీరాజనాలు అందుకుంది. అటు వీరాంజనేయ చిత్రంలో సీతమ్మ వారి పాత్రలో మెప్పించడం విశేషం.

5 /7

చంద్రకళ - సంపూర్ణ రామాయణం | ఇక సీతమ్మ వారి క్యారెక్టర్ లో ఒదిగిపోయిన నటి  చంద్రకళ. బాపు డైరెక్షన్ లో  శోభన్ బాబు శ్రీరాముడిగా నటించిన సంపూర్ణ రామాయణంలో చంద్రకళ సీత పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు.

6 /7

  సురభి కమలభాయి -పాదుకా పట్టాభిషేకం | అసలు తెలుగు చిత్రాలు  పౌరాణిక సినిమాలతో  ప్రారంభమయింది. రామకథతో వచ్చిన తొలి తెలుగు  సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో రిలీజైన ఈ చిత్రంలో  యడవల్లి సూర్యనారాయణ తొలిసారి శ్రీ రాముని పాత్రలో నటించారు. ఇందులో సురబి కమలాబాయి సీత పాత్రలో నటించారు.

7 /7

వెండితెర సీతమ్మలు.. శ్రీరామపట్టాభిషేకంలో సంగీత.. బ్రహ్మర్షి విశ్వామిత్రలో కనక.. పాదుకా పట్టాభిషేకం సినిమాలో రేఖ తల్లి పుష్పవల్లి.. సీతారామ జననంలో త్రిపుర సుందరి.. ఎన్టీఆర్ సంపూర్ణ రామాయణంలో పద్మిని.. సీతారామ కళ్యాణంలో గీతాంజలి.. ఇంద్రజిత్ సినిమాలో రాజశ్రీ.. భూ కైలాస్ లో విజయ నిర్మల.. శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో దేవిక.. శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో బి.వి.సరోజాదేవి..దేవుళ్లు సినిమాలో లయ.. శ్రీరామదాసులో అర్చన (వేద), రామాయణం మూవీలో స్మితా మాధవ్  సీతమ్మ వారి పాత్రల్లో నటించడం విశేషం.