Sri Rama Navami 2025: రామాయాణానికి తెలుగు తెరకు విడదీయరాని అనుబంధమే ఉంది. తెలుగు సిల్వర్ స్క్రీన్ పై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో తెరకెక్కలేదు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి ప్రభాస్ వరకు చాలా మంది హీరోలు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారు.
ప్రభాస్ (Prabhas): రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించడం విశేషం. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
నందమూరి బాలకృష్ణ ( Balakrishna): నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కేవలం పాటల్లో రాముడి పాత్రల్లో కనిపించడం విశేషం.
సుమన్ (Suman): టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు సుమన్.. భద్రాచలం రామ మందిరం నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీరామదాసు'లో రాములోరి పాత్రలో ఒదిగిపోయారు.
శ్రీకాంత్ (Srikanth): కోడిరామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం 'దేవుళ్లు'. ఈ సినిమాలో శ్రీకాంత్ కాసేపు శ్రీరామచంద్రుడి పాత్రలో నటించడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR): నందమూరి తారకరామారావు జూనియర్ తన సినీ జీవితాన్ని రాముడి పాత్రతో మెప్పించడం విశేషం. అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.
శోభన్ బాబు (Shobhan Babu): బాపు దర్శకత్వంలో నట భూషణ శోభన్ బాబు తెరకెక్కిన చిత్రం 'సంపూర్ణ రామాయణం'. ఈ సినిమాలో శోభన్ బాబు తొలిసారి రాములోరి పాత్రలో నటించి మెప్పించారు.
NTR (ఎన్టీఆర్) : తెలుగు ప్రేక్షకులకు శ్రీరామచంద్రుడు అంటే నందమూరి తారక రామారావే. తెలుగు తెరపై రాముడి పాత్రలో ఆయన జీవించిన విధానంతో ఆయన వెండితెర రాముడిగా పేరు ఘడించాడు. అలనాటి 'సంపూర్ణ రామాయణం' నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు చాలా చిత్రాల్లో రాముడి పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది.
అటు తెలుగు తెరపై అలనాటి హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, హరనాథ్, రవి సహా పలువురు కథానాయకులు కూడా శ్రీరాముడి పాత్రల్లో నటించి మెప్పించడం విశేషం.