Sri Sharannavaratri:దేవీ శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఇలా తొమ్మిది రోజులు వ్రతం పాటించలేనివారు సప్తమి , అష్టమి , నవమి తిథులలో దీక్ష పాటిస్తుంటాు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు. ఈ రోజు సప్తమి, మూలా నక్షత్రం కలిసి రావడంతో అమ్మవారి సరస్వతి దేవి అలంకారంలో పూజించడం ఆనవాయితీగా వస్తోంది.