Sridevi Affair with star hero: ఆ సూపర్ స్టార్ తో శ్రీదేవి ఎఫైర్.. బోనీ కపూర్ ఎంట్రీతో అంతా రివర్స్..

Sridevi Affair with star hero:  శ్రీదేవి బాలనటిగా సినీ రంగం ప్రవేశం చేసి ఆ తర్వాత లేడీ ప్యాన్ ఇండియా సూపర్  స్టార్ గా అన్ని భాషల్లో సత్తా చాటింది. అంతేకాదు అతిలోక సుందరిగా అలరించిన ఈమె జీవితంలో సినిమాకు మించిన ట్విస్టులున్నాయి. ఫేమస్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో మ్యారేజ్ కు ముందు ఈమె ఓ సూపర్ స్టార్ తో ఎఫైర్ నడిపించట.

 

1 /8

Sridevi Marriage:ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులున్నాయో .. హీరోయిన్ శ్రీదేవి నిజ జీవితంలో థ్రిల్లర్ కు మించిన  ట్విస్టులున్నాయి. అది సినిమాగా తీస్తే.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని చెప్పాలి. కెరీర్ లో హీరోయిన్ గా  ఎదుగుతున్నసమయంలో చాలా మంది హీరోలు ఆమెపై మనసు పడ్డారు.అందులో శ్రీదేవి మనసు దోచిన వారు ఒకరిద్దరు ఉన్నారు. 

2 /8

శ్రీదేవి 80వ దశకంలో ఆమె పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరు లేరనే చెప్పాలి. ఆమె జమానాలో ఎంతో మంది నటీమణులున్నా.. సూపర్ స్టార్ డమ్ దక్కించుకుంది మాత్రం శ్రీదేవి అని చెప్పాలి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న శ్రీదేవి.. 54 యేళ్ల వయసులో దుబాయిలో అనుమానాస్పదంగా మరణించడం ఆమె అభిమానులను కలిచి వేసింది.

3 /8

శ్రీదేవి హిందీలో పలువురు సూపర్ స్టార్స్ తో నటించినా.. మిథున్ చక్రబర్తితో ఆమె లవ్ సెపరేట్ అని చెప్పాలి. అప్పట్లో  వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని పత్రికలు కోడై కూసాయి. అప్పటికే పెళ్లై పిల్లలున్న మిథున్ ను పెళ్లి చేసుకుందామనుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి.    

4 /8

80వ దశకంలో హిందీ, తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో కాల్షీట్స్ దొరకనంత బిజీగా ఉండేది. చాలా మంది స్టార్స్ ఆమె సరసన నటిస్తే చాలనుకునే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా వెండితెరపై శ్రీదేవి, రజనీకాంత్ జంట హిట్ పెయిర్‌గా పేరు గడించారు. తమిళం, హిందీలో వీళ్లిద్దరు 19పైగా చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో జితేంద్ర, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత శ్రీదేవి ఎక్కువ చిత్రాలు రజినీ సరసన చేయడం విశేషం.  

5 /8

వీళ్లిద్దరు 1976లో కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో వీళ్లిద్దరు ఫస్ట్ టైమ్ కలిసి నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి.. రజినీకాంత్ సవతి తల్లి పాత్రలో నటించింది. ఆ తర్వాత రజినీకాంత్.. శ్రీదేవిని ప్రేమించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆమెను ప్రేమించాలనుకున్నాడు.

6 /8

ఒకరోజు, ఆమె ఇంట్లో గృహప్రవేశానికి వెళ్లినపుడు.. శ్రీదేవి  ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. అతను అక్కడికి వెళుతుండగా, ఆకస్మాత్తుగా కరెంటు పోయింది. ఆ సంఘటనను ఒక అపశకునంగా భావించిన రజనీకాంత్ ఆరోజు పెళ్లి ప్రస్తావన చేయకుకండానే తిరిగి వచ్చేసాడు.  అయితే.. అప్పటికే రజినీకాంత్ కు లతాతో వివాహాం జరిగింది. ఆ తర్వాత సిల్క్ స్మిత తో కొన్నాళ్లు రజినీకాంత్ ఎఫైర్ నడిచిందనే కామెంట్స్ వినబడ్డాయి.

7 /8

ఇక శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్న టైమ్ లో లతా అడ్డుపడింది. ఒకానొక సమయంలో శ్రీదేవి, రజినీకాంత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని పత్రికలు  వార్తలను వండి వార్చాయి కూడా.  ఈ సంఘటన తర్వాత ఆ తర్వాత శ్రీదేవి, రజినీకాంత్.. మరలా కలిసి యాక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు లీడ్ చేస్తున్నారు. మధ్యలో ఫంక్షన్స్ లో కలిసినా.. అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు.

8 /8

ఆ తర్వాత  నటిగా హిందీలో బిజీ అయిన శ్రీదేవి ముంబైలో సెటిల్ అయింది. ఆ సమయంలో శ్రీదేవి అమ్మగారికి బాగా లేకపోవడంతో బోనీ కపూర్ అండగా నిలబడ్డాడు. అలా వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో వాళ్లిద్దరు మానసికంగా..శారీరకంగా ఒకటయ్యారు. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి అయ్యారు. జాన్వీ పుట్టిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అంతకు ముందు బోనీ కపూర్ కు రాఖీ కట్టిన శ్రీదేవి.. తల్లికి ఆరోగ్యం బాగాలేపపుడు దగ్గర కావడంతో అప్పటికే పెళ్లైన బోనీ కపూర్ ను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.