Add Zee Business As A Preferred Source
App

Sridevi: స్టార్ డైరెక్టర్ కి అప్పట్లో కుక్క బిస్కెట్ విసిరిన శ్రీదేవి.. ఏదో కనికరం చూపించినట్టుగా..!

Written ByVishnupriya
Published: Sep 09, 2025, 12:21 PM IST|Updated: Sep 09, 2025, 12:21 PM IST

Sridevi Shocking Comments. 

శ్రీదేవి గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు.. పరిచయాలు అవసరం లేదు. ఆమె చనిపోయిన కూడా ఇంకా ఆమె సినిమాలు అభిమానుల గుండెల్లో అలానే నిలిచిపోయి ఉన్నాయి. అంతేకాకుండా శ్రీదేవి చాలా తక్కువ తెలుగు ఇంటర్వ్యూస్ లోనే మనకు కనిపించింది.. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి.

Sridevi Interview 1/5

శ్రీదేవి

తెలుగులో ఎన్నో సినిమాలు చేసి.. తెలుగు సినిమా చరిత్రలోనే అతిలోకసుందరిగా మిగిలిపోయిన హీరోయిన్ శ్రీదేవి. ముఖ్యంగా దర్శకుడు రాఘవేంద్రరావుతో ఆమె ఎన్నో సినిమాలు చేసింది.

Sridevi Shocking Comments 2/5

శ్రీదేవి ఇంటర్వ్యూ

ఈ క్రమంలో ఆమె చనిపోకముందు.. ఒకసారి ఈటీవీలో రాఘవేంద్రరావు టాక్ షో జరగగా.. ఆ షో కి ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇక ఆమెతో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు.. 

Sridevi About RGV3/5

శ్రీదేవి షాకింగ్ కామెంట్స్

ఇక ఈ ఇంటర్వ్యూలో సుమ శ్రీదేవిని మీరు మరిచిపోలేని రెండు సినిమాలు చెప్పండి అంటే.. వెంటనే వేటగాడు, జగదేకవీరుడు అతిలోకసుందరి పేర్లు చెప్పింది శ్రీదేవి. ఇక దాంతో రాఘవేంద్రరావు థాంక్స్ అన్ని నా సినిమా పేర్లు చెప్పినందుకు అని అన్నారు. 

Sridevi RGV4/5

శ్రీదేవి రామ్ గోపాల్ వర్మ

అపుడు శ్రీదేవి.. క్షణం క్షణం కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది అని అనగానే వెంటనే పక్కనే ఉన్న రాంగోపాల్ వర్మ.. షో మొదలైన దగ్గర నుంచి చూస్తున్నాను.. ఏదో నాకోసం ఒక కుక్కకి బిస్కెట్ విసిరేసినట్లు నాకు కుక్క బిస్కెట్ విసిరేస్తున్నారు శ్రీదేవి అని తమాషాగా చెప్పుకొచ్చారు. 

 

Sridevi in Raghavendra Rao Talk Show 5/5

శ్రీదేవి సినిమాలు

ఇక శ్రీదేవి అంటే రాంగోపాల్ వర్మకు ఎంత ప్రేమ అనేది..ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్యన ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.