Samantha: సమంత నేను నిజంగానే చనిపోయినట్లు ఏడ్చారు..: తెలుగు స్టార్ హీరో

Samantha Acting: రంగస్థలం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య శబ్దం సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆది పినిశెట్టి సైతం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఈ నటుడు షేర్ చేసుకున్న కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

1 /5

రంగస్థలం సినిమా 2018లో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఇద్దరూ కూడా తమ పాత్రలలో.. ఎంతో నైపుణ్యంతో పోషించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు.

2 /5

అయితే వీరిద్దరితో దీటుగా ఈ సినిమాలో నటించిన మరో నటుడు.. ఆది పినిశెట్టి.. ఈ కథ చాలా వరకు ఈయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తెలుగులో వైశాలి లాంటి మంచి సూపర్ హిట్ అందుకున్న ఆది పినిశెట్టి ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నారు.  

3 /5

కాగా సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో, ఆది పినిశెట్టి పాత్ర మరణిస్తాడు. ఈ సన్నివేశంలో సమంత నిజంగానే ఆ క్యారెక్టర్ మరణించినట్లు భావించి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ఆ సన్నివేశంలో చూపిన భావోద్వేగం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

4 /5

ఇక ఇదే విషయాన్ని శబ్దం సినిమా ప్రమోషన్స్ లో హీరో ఆది పినిశెట్టి తెలియజేశారు. ఓరయ్యో సాంగ్లో.. సమంత నిజంగానే తాను చనిపోయినట్లు భావించి ఏడ్చింది అని చెప్పుకొచ్చారు.   

5 /5

సమంత తన పాత్రను అద్భుతంగా పోషించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆది పినిశెట్టి సైతం ఇలా చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.