Star Actress: ప్రముఖ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్లిపో..
1/5సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వరుస అవకాశాలు అందుకోవడానికి చాలామంది సెలబ్రిటీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే వారు ఎన్నో ఇబ్బందులను.. ఎదుర్కొన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాంటివారిలో హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఒకరు.
2/5మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి, బాగానే క్రేజ్ ను సంపాదించింది. మొదటిసారి ఈ మాయ పేరేమిటో అనే చిత్రంతో 2018లో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
3/5ఆ తర్వాత ఏక్ మినీ కథ, బిచ్చగాడు-2, ఊరి పేరు భైరవకోన తదితర చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న కావ్య థాపర్ ఆ తర్వాత నటించిన చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. చివరిగా గత ఏడాది విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా తన సినీ కెరియర్ లో జరిగిన మొదటి రోజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.. కెరియర్ ప్రారంభంలో ఒక యాడ్ కోసం ఆఫర్ రావడంతో ఆడిషన్స్ కి వెళ్ళానని, అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తెలియజేసింది కావ్య థాపర్.
4/5తనకు నాలుగు యాడ్స్లలో అవకాశం కలిపిస్తానని, అందుకు దానిని తీసుకోవాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని డైరెక్ట్ గా మొహం మీద అడిగేసారట.. దీంతో తనకి చాలా కోపం వచ్చి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసానని తెలియజేసింది కావ్య థాపర్. అయితే తను చూడడానికి తన తండ్రి వయసు కలిగి ఉన్నప్పటికీ కూడా అలా చేయడం చాలా బాధ అనిపించిందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
5/5కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టలేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్న కావ్య థాపర్ మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరో చిత్రాలలో నటించే అవకాశాలను సంపాదిస్తుందేమో చూడాలి.