Eesha Rebba Love: టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న హీరోయిన్..ఈషా రెబ్బా.. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ ఒక స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు అంతకుముందే పెళ్లి జరిగిఉందడం గమనర్హం.. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/6టాలీవుడ్‌లో ప్రేమాయణాలు కొత్తేమీ కావు. హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు, దర్శకులు, నిర్మాతల మధ్య కూడా ఇలాంటి సంబంధాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్.. నటి ఈషా రెబ్బా పేర్లు చర్చకు వచ్చాయి.
2/62016లో విడుదలైన పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల మనసు దోచుకున్న తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్ట కథలు, కీడా కోలా వంటి సినిమాలు తెరకెక్కించారు. కానీ ఈ సినిమాలు ఆయన కెరీర్‌లో పెద్ద హిట్‌లుగా నిలవలేదు. దర్శకుడిగా కంటే నటుడిగా కూడా ఆయన బిజీగా మారారు.
3/6మరోవైపు..ఈషా రెబ్బా తెలుగులో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి. అమెతుమీ, బందిపోటు, అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈషా.. తన అందం.. నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయి మాత్రం ఇంకా అందుకోలేదు.
4/6ఇప్పుడు తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి సోషల్ మీడియాలో..ఫిలింనగర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. వీరిద్దరూ నటిస్తున్న కొత్త చిత్రం ఓం శాంతి శాంతి శాంతి షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడి..ఆ పరిచయం ప్రేమగా మారిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
5/6ఇటీవల వీరిద్దరూ కలిసి హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలలో ఈషా, తరుణ్ పక్కపక్కనే కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలు నెట్‌లో వైరల్ అయ్యి, “ఇద్దరి మధ్య ఏదైనా ప్రత్యేకమైన బంధం ఉందా?” అని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.
6/6తరుణ్ భాస్కర్ ఇప్పటికే లతా నాయుడుతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లతా కూడా సినిమా రంగానికే చెందినవారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలకు ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. కానీ కొంతకాలం క్రితం వీరిద్దరూ.. విడిపోయారు. ఇప్పుడు ఈషాతో తరుణ్ సాన్నిహిత్యం ఉండటంతో ఈ వార్తలు మరింత బలం పొందుతున్నాయి. అయితే.. వీరి రిలేషన్ నిజమేనా లేదా కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫిలింనగర్ వర్గాలు మాత్రం ఈ విషయం మీద ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.