Add Zee Business As A Preferred Source
App

Star Hero: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మాజీ భార్య ఇంటికి వెళ్లిన స్టార్ హీరో.. ఇదేమి బాగోతం రా బాబు..!

Written ByVishnupriya
Published: Apr 29, 2025, 09:17 AM IST|Updated: Apr 29, 2025, 09:17 AM IST

Celebrity News: కొత్త గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని మాజీ భార్య ఇంటికి వెళ్లారు స్టార్ హీరో.. వినటానికి విడ్డూరంగా ఉన్న జరిగింది ఇదే. మాజీ భార్య రీనా దత్త ఇంట్లో.. అమీర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రత్ తో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Aamir Khan New Girl Friend 1/5

అమీర్ ఖాన్

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. 

Aamir Khan Ex Wife 2/5

అమీర్ ఖాన్

ఇకపోతే తన సినిమాలతో అమీర్ ఖాన్ ఎంత పేరైతే సొంతం చేసుకున్నారో.. అటు వ్యక్తిగత జీవితం కారణంగా అంతే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా తన మాజీ భార్య రీనా దత్త ఇంట్లో తన ప్రేయసితో కలసి కనిపించారు అమీర్ ఖాన్.. మొత్తానికి అయితే అమీర్ ఖాన్ తన ప్రేయసితో తన మాజీ భార్య ఇంట్లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు 

Aamir Khan Controversy 3/5

అమీర్ ఖాన్

ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  

Aamir Khan Personal Life4/5

అమీర్ ఖాన్

ఇక అమీర్ ఖాన్ వైవాహిక జీవిత విషయానికి వస్తే.. 1986 ఏప్రిల్ 18వ తేదీన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీనా దత్త ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇరాక్ ఖాన్ జునైద్ ఖాన్, ఇరా అనే పిల్లలు పుట్టారు. ఇక సంతోషంగా వైవాహిక జీవితం లో కొనసాగుతున్న ఈ జంట.. 2002 డిసెంబర్లో విడాకులు తీసుకున్నారు ఇక ఈ పిల్లల ఇద్దరు బాధ్యతను రీనా దత్తాను తీసుకోవడం గమనార్హం.

Aamir Khan Affairs5/5

అమీర్ ఖాన్

ఇక రీనా దత్తా నుండి విడాకులు తీసుకున్న తర్వాత అమీర్ ఖాన్ 2015 డిసెంబర్ 28న కిరణ్ రావ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 201 1 డిసెంబర్ 5న ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు జన్మించారు సరోగసి ద్వారా వీరు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇక తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చినా ఈయన.. గౌరీ స్ప్రత్ తో ప్రేమలో పడ్డారు ఎక్కువగా ఈమెతో కలిసి తిరుగుతూ చట్టా పట్టాలేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.