Star Hero Daughter Divorce: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంతో జరుగుతాయో.. అంతే వేగంగా విడాకులు కూడా జరిగిపోతూ ఉంటాయి. అందులో ఎవరిది తప్పూ.. ఎవరిది ఒప్పో చెప్పడం కష్టమే అని చెప్పాలి. తాజాగా తెలుగులో టాప్ మోస్ట్ సీనియర్ స్టార్ హీరో కూతురు తన 19 ఏళ్ల వివాహా బంధానికి ముగింపు పలకబోతుందనే మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును మోహన్ బాబు గారాల పట్టి లక్ష్మి ప్రసన్న .. కూడా నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా స్టార్ డమ్ సాధించలేదు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి నిర్మాతగా.. రచయతగా..యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు పరిశ్రమలో తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ముఖ్యంగా అమెరికాలో పెరిగిన లక్ష్మీ ప్రసన్న మంచు తన అమెరికన్ తెలుగుతో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. మరోవైపు ట్రోల్స్ కు గురైంది కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు ఫ్యామిలీ పలు అంశాల కారణంగా వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు.
రీసెంట్ గా మంచు మనోజ్ తో మోహన్ బాబు ఆస్తి గొడవల కారణంగా వీళ్ల కుటుంబ పరువు బజారున పడింది. అది చాలదన్నట్టు ఇపుడు మంచు లక్ష్మి విడాకులు తీసుకోబోతుందనే మ్యాటర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇస్తూ.. తన భర్త శ్రీనివాస్ ఫారెన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మేమిద్దరం దూరంగా ఉన్నా.. మనసులు మాత్రం దగ్గరగా ఉన్నాయి. తాను తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అని ఆందోళన వ్యక్తం చేశారు.
మంచు లక్ష్మీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం లక్ష్మీ మంచు ముంబైకు మకాం మార్చింది. అక్కడ పలు వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ తన కుటుంబంలో జరుగుతున్న గొడవలను శాంతి యుతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.