Sreeleela marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది యంగ్ బ్యూటీ శ్రీ లీల. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలయ్య షోలో మెరిసింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ అందుకుంది శ్రీ లీల. పెళ్లి సందD సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన శ్రీ లీల, ఒకే ఏడాది 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
అవకాశాలు తలుపు తట్టాయి కానీ అదృష్టం మాత్రం దూరం అయిందని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. ఇకపోతే చివరిగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకి కూతురు గెటప్ లో నటించింది. అయితే ఈ సినిమా విజయం సాధించినా.. ఆ క్రెడిట్ మాత్రం బాలకృష్ణ ఖాతాలో చేరిపోయిందని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా సమయం నుంచి ఇద్దరి మధ్య బంధం మరింత పెరిగింది. బాలకృష్ణ కూడా సొంత కుటుంబ సభ్యురాలి గానే శ్రీ లీలాను ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా శ్రీ లీలా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ కార్యక్రమానికి హాజరయ్యింది.
అందులో భాగంగానే బాలకృష్ణ తో మహేష్ బాబు కళ్ళు అంటే చాలా ఇష్టమని, అవే కాకుండా ఆయన కటౌట్ అంటే మరింత ఇష్టం అని తెలిపిన ఈమె, కన్నడ హీరో యష్, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్లు ఇష్టమని తెలిపింది.ఈ మేరకు బాలయ్య శ్రీలీలకు ఒక ప్రామిస్ చేశారు. మహేష్ బాబు కటౌట్ తో యష్,అల్లు అర్జున్ లలో ఉన్న క్వాలిటీస్ కలిగిన అబ్బాయిని నీకు భర్తగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ శ్రీ లీలాతో తెలిపారు.
ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా శ్రీలీలా పెళ్లి చేసే బాధ్యతను బాలయ్య తీసుకున్నాడు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.