Jagapathi Babu: జగపతిబాబు వల్ల లక్షల్లో డబ్బులు నష్టపోయానని.. సంచలన విషయం బయటపెట్టిన తెలుగు స్టార్ హీరో..!

Jagapathi Babu : సినీ రంగం అనేది చాలా విచిత్రమైన ప్రపంచం. పేరు, డబ్బు, గుర్తింపు కోసం చాలా మంది ప్రయత్నిస్తారు కానీ విజయం మాత్రం అందరికీ రాదు. కొంతమంది మాత్రమే కష్టాలు ఎదుర్కొని నిలబడతారు. ఆ జాబితాలో ఒకరు నటుడు వేణు తొట్టెంపూడి. ఇక ఈ హీరో తాజాగా జగపతిబాబు గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..

1 /5

వేణు మంచి కుటుంబ నేపథ్యం కలవాడు. తన తొలి చిత్రం స్వయంవరంతోనే సక్సెస్ సాధించాడు. తరువాత మనసు పడ్డాను కానీ, హనుమాన్ జంక్షన్, మళ్లీ మళ్లీ చూడాలి, ఖుషి ఖుషిగా వంటి హిట్స్‌తో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ తరువాత వచ్చిన ఫ్లాప్స్ కారణంగా ఆయన కెరీర్‌లో గ్యాప్ వచ్చింది.

2 /5

దాదాపు పదేళ్లపాటు సినిమాల నుండి దూరంగా ఉన్న వేణు.. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం ఆయన సినిమాలకంటే వ్యాపారాలపై దృష్టి పెట్టారు.  

3 /5

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు తన జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. "సినిమానే నా జీవితం. నా భార్య అనుపమా చౌదరి ఎప్పుడూ నాకు బలంగా నిలిచింది. ఆమె గృహిణిగా చాలా కష్టపడుతోంది" అని చెప్పారు.

4 /5

అదే ఇంటర్వ్యూలో జగపతిబాబు గురించి అడిగినప్పుడు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. “జగపతిబాబుతో హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషిగా సినిమాలు చేశాం. ఆయన చాలా మంచి మీ వ్యక్తి. కానీ ఒక సందర్భంలో ఆయన మాట నమ్మి 14 లక్షలు ఇచ్చా. కానీ ఆ డబ్బు తిరిగి రాలేదు. నేను బాధపడ్డా కానీ ఎవరితోనూ చెప్పుకోలేదు. జగపతిబాబు గారు కూడా నాకు మళ్ళీ ఫోన్ చేసి అడగలేదు. అప్పటి నుంచి ఆయనను కలవలేదు” అని వేణు తెలిపారు.

5 /5

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు చేసిన ఈ వ్యాఖ్యలపై జగపతిబాబు ఎలా స్పందిస్తారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.