Star Hero: తల్లిగా నటించిన నటితో ప్రేమలో పడిన స్టార్ హీరో.. రెండు వివాహాలు చేసుకున్న స్టిల్ బ్యాచిలర్..!

Star Hero love Affair: సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తమతో నటించిన నటీనటులను పెళ్లి చేసుకోవడం కామన్. కానీ ఈ హీరో మాత్రం తనకు తల్లిగా నటించిన హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమ సఫలం కాలేదు. ఆ తర్వాత ఈమె ఇతనికి తల్లిగా.. భార్యగా కూడా నటించడం విశేషం.

1 /6

Star Hero: తమిళ నటుడు కమ్ కమల్ హాసన్ తనకు తల్లిగా నటించిన కథానాయికతో పీకలోతు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. గౌతమితో కొన్నాళ్లు డేటింగ్ చేసాడు. ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

2 /6

కమల్ హాసన్ .. నటుడిగా అపుడపుడే పై కొస్తోన్న సమయంలో తన తోటి నటి శ్రీవిద్యను ప్రేమించాడు. కానీ ఆమె తల్లి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరి ప్రేమ పెళ్లికి దారితీయలేదు.  ఆ తర్వాత ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను క్యాన్సర్ తో మరణించారు. అటు శ్రీవిద్య కూడా క్యాన్సర్ తో కన్నుమూయడం విషాదకరం.

3 /6

కమల్ హాసన్, శ్రీవిద్య అప్పటికే పలు చిత్రాల్లో నటించారు. ముందుగా వీళ్లిద్దరు ‘వేలంకన్ని’ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ‘అపూర్వ సహోదరళ్’(విచిత్ర సహోదరులు) సినిమాలో శ్రీవిద్య.. కమల్ హాసన్ భార్యగా.. తల్లిగా నటించడం విశేషం. ఈ సినిమాలో కమల్.. త్రిపాత్రాభినయం చేసారు.    

4 /6

శ్రీవిద్యతో  ప్రేమ బ్రేకప్  తర్వాత కమల్ హాసన్ 1978లో  వాణీ గణపతిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ  ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. వాళ్లిద్దరు 1988లో  విడాకులు తీసుకున్నారు.

5 /6

ఇక 1988 కమల్ హాసన్ సారిక ఠాకూర్ ను  రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004 లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శృతి హాసన్.. కమల్, సారికలు డేటింగ్ చేస్తోన్న సమయంలోనే పుట్టింది. ఈమె పుట్టిన తర్వాత వీరి పెళ్లి జరిగింది.    

6 /6

ఆ తరువాత, కమల్ నటి గౌతమితో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ కొన్నాళ్ల సహజీవనం తర్వాత విడిపోయారు.  వీళ్లిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమల్ హాసన్ వయసు 70. ప్రస్తుతం ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధినేతగా ఉన్నారు. త్వరలో రాజ్యసభ కు వెళ్లనున్నారు.