Add Zee Business As A Preferred Source
App

Star Heroine: ఒకప్పుడు స్టార్ హీరోయిన్... ఇప్పుడు వేశ్య.. విధి ఎంత విడ్డూరం..!

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Apr 17, 2025, 12:45 PM IST|Updated: Apr 17, 2025, 12:45 PM IST

Bindu Madhavi: స్టార్ స్టేటస్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్ గానే ఉండగా.. మరి కొంతమంది మాత్రం కొన్ని సంవత్సరాలు మాత్రమే స్టార్స్ లేటెస్ట్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కథనే ప్రస్తుతం బిందు మాధవి జీవితాన్ని చూడగలము. 

Bindu Madhavi in Adult Working Role 1/5

ఒకప్పుడు టాలీవుడ్‌లో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి బిందు మాధవి. శేఖర్ కముల దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఆవకాయ బిర్యానీ సినిమాతో పరిచయమైంది ఈ హీరోయిన్. అప్పట్లో కొద్ది రోజులపాటు మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ కి ఆ తర్వాత మాత్రం పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు.

Bindu Madhavi Movies2/5

ఆవకాయ బిర్యాని.. ఆ తర్వాత ఆమె తమిళ సినిమాల్లో బిజీ అయింది. "పోకిషం", "కాజగు", "కేడి బిల్లా కిల్లాది రంగ" వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించింది. తెలుగులో "రామ రామ కృష్ణ కృష్ణ", "పిల్ల జమీందార్" వంటి సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

Bindu Madhavi Career3/5

2022లో బిందు మాధవి "బిగ్ బాస్ నాన్ స్టాప్" అనే తెలుగు ఓటీటీ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, బిగ్ బాస్ విజయంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చారు.

Bindu Madhavi Bold Role 4/5

ఈ క్రమంలో ప్రస్తుతం బిందు మాధవి "దండోరా" అనే సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతున్నారంట.  ఈ పాత్ర ఒక నటికి ఎంతగానో చాలెంజింగ్‌గా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఈ సినిమా దర్శకుడు మురళీకాంత్, కథను బలంగా రూపొందించినట్లు సమాచారం.  

Bindu Madhavi as Prostitute5/5

తెలుగు పరిశ్రమలో ఎన్నో హీరోయిన్‌లు కొంతకాలం క్రేజు సంపాదించి, తరువాత మాయం అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ బిందు మాధవి మళ్లీ తెరపైకి వస్తూ, వేశ్య పాత్ర ద్వారా నటనలో తన పరిజ్ఞానాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇది ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రేక్షకులు ఈ కొత్త అవతారాన్ని ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.